Friday, September 25, 2015

యోగ ని ఇస్లాం దేశాలు 57 లో 46 దేశాలు ఇరాన్,గల్ఫ్ ముస్లిం దేశాలు,బహ్రయిన్,సిరియా, ఆఫ్ఘనిస్థాన్ ,ఇండోనేషియా మొదలైనవి యోగ డే ని ఒప్పుకుంటున్నప్పుడు ఈ ముస్లిం నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు


యోగ ని ఇస్లాం దేశాలు 57 లో 46 దేశాలు ఇరాన్,గల్ఫ్ ముస్లిం దేశాలు,బహ్రయిన్,సిరియా, ఆఫ్ఘనిస్థాన్ ,ఇండోనేషియా మొదలైనవి యోగ డే ని ఒప్పుకుంటున్నప్పుడు ఈ ముస్లిం నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. అల్లా ముందు తప్ప ఎవరి ముందు కూడా వంగని ముస్లిములు జిం వ్యాయంశాల లో వంగుతారు కదా.అది ముస్లిం వ్యతిరేకమ? సూర్య నమస్కారం లో గాని ఓం చెప్పటం లో తప్పేముంది? సూర్యుని నుండి కేవలం హిందువులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారా? ఓం కాని, ఆమెన్ కాని ఒకే శబ్దం నుండి వచ్చినవే కదా? చాల మంది ముస్లిం నాయకులు యోగ కి తాము వ్యతిరేకం కాదంటూనే ముస్లిములకు వ్యతిరేకమని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఈ టెన్షన్ ప్రపంచంలో యోగాసనాలు చేయటం రిలీఫ్ ఇస్తుందని ప్రపంచానికి తెలుసు.అది ఇస్లాం కి వ్యతిరెకంగా చెపుతూ ప్రజలను మతాల వారిగా విడదీస్తున్నారు. లెక్కల్లో 'సున్నాను ' ఇచ్చింది హిందువులు.అది ముస్లిములకు వ్యతిరేకమా? రోగం వస్తే యూనాని మదులు, ఆయుర్వేద మందులు వాడుతారు కదా.అవి ఫలాన మతాల వారు ప్రవేశపెట్టారని, వ్యతిరేకిస్తామా?ప్రపంచంలో 46 ముస్లిం దేశాలకు లేని ఈ స్వార్థపు ఆలోచనలు ఈ ఒవైసీ సోదరులకు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ మొదలైన రాజకీయ నాయకులు ప్రమాదకర ప్రకటనలతో ప్రజలను విడదీస్తున్నారు.ఇరాన్లో వందలాది యోగ కేంద్రాలు వున్నాయి.జపాన్లో షింటో మతస్థులు యోగాసనాలు చేస్తూ 'యోగ ' ప్రాధాన్యత సంతరించుకున్నదక్కడ. 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మొదలు పెట్టిన యోగ ని, ఇప్పటి రాజకీయ నాయకులు యోగని నరేంద్ర మోడి ది గా భావించటం అజ్ఞానం.పతంజలి సూత్రాలను అల్ బెరూని అనే ముస్లిం పండితుడు అరబ్బీ లోకి అనువదించి అరబ్ దేశాలకు పరిచయం చేశాడు.యోగ ఒక వేళ మతాచారమైతే ఆయన ఎందుకు ముస్లిం దేశాల్లో ప్రవేశపెట్టాడు? వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగ ని అంతర్జాతీయ దినంగా మోడి ప్రతిపాదించాడంతే.175 దేశాలు ఒప్పుకున్నాయి..మన దేశం ప్రతిపాదిస్తే ప్రపంచం ఒప్పుకున్నందుకు,ఒక దేశంగా గర్వించాలి. అయితే ఇబ్బందేమిటంటే ఈ అసఫ్ జా వంశస్థులకు ఈ దేశానిదేదైన వ్యతిరేకించటం వీళ్ళ ప్రవృత్తి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. యోగ ని ఇస్లాం దేశాలు 57 లో 46 దేశాలు ఇరాన్,గల్ఫ్ ముస్లిం దేశాలు,బహ్రయిన్,సిరియా, ఆఫ్ఘనిస్థాన్ ,ఇండోనేషియా మొదలైనవి యోగ డే ని ఒప్పుకుంటున్నప్పుడు ఈ ముస్లిం నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers