Friday, September 25, 2015

హిందూ గణిత శాస్త్రవేత్త ' బోధాయనుడు '


హిందూ గణిత శాస్త్రవేత్త ' బోధాయనుడు ' భుజాలతో దీర్ఘ చతురస్రాకారాన్ని నిర్మించడం వంటి విషయాలను పైథాగరస్ కంటే ముందు వివరించాడు.అప్పటికి ఇంకా క్రీస్తు పుట్టలేదు.క్రీస్తు పూర్వం 500-425 సంవత్సరం నాటి వాడు.కృష్ణ యజుర్వేదం ఆధారంగా శుల్బ సూత్రాలను రచించాడు.అయినా ఏ మాత్రం గర్వం ప్రదర్శించకుండా 'నా కంటె ముందువున్న మేధావులు చెప్పిన వాటినే క్రోడీకరించానని ' చెప్పుకుంటాడు.'
'గర్గ ' అను శాస్త్ర వేత్త క్రీ.పూ.300 వరాహమిహిరుని కంటే ముందు వాడు.గ్రహ,నక్షత్రలను విపులీకరించాడు.' 'లగధ ' అను శాస్త్రవేత్త క్రీ.పూ.900 ఖగోళాన్ని,కాలగమనాన్ని ఋతువులు,అయనాలు,సంవత్సరాలు,మాసాలు,దినములు వివరించాడు. ' మేధాతిథి ' అను శాస్త్రవేత్త క్రీ.పూ.200సంవత్సరం నాటి వాడు. 1,10,100,1000 నుండి అత్యధిక సంఖ్య ను వివరించాడు.ఖలీఫా అల్ మన్సూర్ అరబ్ దేశాలకు ఈ లెక్కల్ని తీసుకెళ్ళాడు. 'ఆర్యభట్ట ' క్రీ.శ.476 లో ఆర్యభట్టీయం వ్రాశాడు.II పై విలువను 3.1416 గా చెప్పాడు. 'శ్రీ సేన్ ' క్రీ.40 లో రోమక సిద్ధాంతం రచించాడు.ఈ పుస్తకం లండన్ లైబ్రరీ లో వుందిప్పుడు. ' వరాహ మిహిరుడు ' క్రీ.శ.499-587 నాటి వాడు.ఉజ్జయినీ లో పుట్టి సూర్యసిద్ధంతం వ్రాసి కాలగమనాన్ని చెప్పాడు. ' బ్రహ్మ గుప్తుడు ' క్రీ.శ.598-674 నాటి వాడు. సున్నా ని ఒక అంకె గా కనుక్కుని గణిత శాస్త్ర చరిత్రలో సువర్ణ పుటలకెక్కాడు. ' సున్నా 'ప్రపంచ గణిత చరిత్రలో అద్భుతాలు సృష్టించింది. మహావీరాచార్యుడు క్రీ.శ.1023 నాటి వాడు.గణితశాస్త్రంలో అందెవేసిన చెయ్యి గల శాస్త్రవేత్త.జైన మతావలంబకుడు ' భాస్కరాచార్యుడు ' క్రీ.శ.1114-1188 నాటివాడు. అంకగణితం,బీజ గణితం,గ్రహ గణితం,గోళాధ్యాయం మొదలైన వాటిని వివరించి సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించాడు.ఆ తరువతి కాలం లో అక్బర్ పాదుషా 1587 పర్శియా భాషలోకి అబుల్ ఫాజిల్ సాయం తో అనువదించాడు. సైన్స్ ని బౌతిక ప్రపంచంలోకి ఆచరణలోకి తెచ్చిన ఈ మహానుభావుల విషయాలు చరిత్ర పుటలకు ఎక్కకుండా కుట్ర పన్నిందెవరు? ఇంకెవరు? స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి నెహ్రూ హయాంలో విద్యా రంగం లో తిష్ట వేసిన కమ్యూనిష్టులు,సెక్యులర్ వాదులు కుమ్మక్కై నిజమైన ప్రాచీన శాస్త్రవేత్తల నిజ చరిత్రను మరుగు పరిచారు.అంతెందుకు? రామక్రిష్ణ పరమహంస,స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావుల చరిత్రలను ఇప్పటివరకు పాఠ్య పుస్తకాల్లోకి ఎందుకు ఎక్కించలేదో అర్థం కావటమ లేదా? ఈ కమ్యూనిష్టులు మరియు సెక్యులర్ వాదుల కుతంత్రాలు ఇంకా కొనసాగుతునే వున్నాయి.వీళ్ళ ప్రధాన పని ఏమిటంటే నిజమైన దేశ చరిత్రలను మరుగున పరిచి ప్రజలను ముఖ్యంగా యువకులను పనికిరాని వారిగా తీర్చి దిద్దటం.తెలంగాణా లోని అన్ని యూనివర్సిటీ ల్లో,మీడియాలో,పత్రికల్లో తిష్టవేసుకుని కూర్చుని విద్యార్థులను,యువకులను తప్పుదారిపట్టించే పని లో వున్నారు.ప్రొఫెసర్ల వలె చలామణి అవుతూ ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్న మార్క్స్,మిషనరీ,ఇస్లాం మానస పుత్రులు వీరు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందూ గణిత శాస్త్రవేత్త ' బోధాయనుడు '

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers