• SWAMI VIVEKANANDA

  YOUTH ICON.

 • Dr.B.R.AMBEDKAR

  Father of the INDIAN CONSTITUTION.

 • HAPPY VINAYAKA CHAVITHI

  Ganesh Chaturthi is on August 29 (Ananta Chaturdasi on September 8).

 • SWAMI VIVEKANANDA

  SWAMI VIVEKANANDA

Friday, September 8, 2017

అంతరాలు దూరమై అందరూ సమానమై || Antaralu Dooramai Andaru SamanamaiThursday, September 7, 2017

భారత సంస్కృతి పరిరక్షణకై-Bharata Samskruti Parirakshanakai || Patriotic Songs in telugu
భారత సంస్కృతి పరిరక్షణకై - సాగించాలి సాధనా
విజయపథమ్మున శ్రమించు తపించు - మాతృభూమి ఆరాధనా
జయహో భరతమాత జయహో
జయహో జగజననీ జయహో  !!

1 విజ్ఞానం వీక్షించిన మునులు - పొంగిపొరలె మానవతా సుధలు
  కణకణమున చైతన్యం నిండిన - సుందర జీవన భూమి ఇది
  సర్వజనుల సంక్షేమం కోసం - చేద్దాం సర్వస్వార్పణా !!విజయపథమ్మున 

2 ధర్మదండమును చేతబూనుదాం - భారత ప్రతిభను ప్రకటిద్దాం 
  ధనాకంక్షలను నియంత్రించుదాం - జీవనమున్నతి సాధిద్దాం
  సాధారణ జన జీవితాలలో - చిరుదివ్వెలనే వెలిగిద్దాం !! విజయపథమ్మున

3 వైవిధ్యాలెన్నున్నా గాని ఏకాత్మతతో జీవిద్దాం
  వైరుధ్యాలను అధిగమించుదాం - సమరస భావం నిర్మిద్దాం
  జగమంతా మన కుటుంబమే - ప్రేమామృతమును పంచుదాం      !! విజయపథమ్మున

Neevu Nenu Hinduvaite || Patriotic Song in telugu by Appala Prasadji

నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం.
కులం పేరిట కలహమెందుకు కలిసి వుంటే భాగ్యము..

రాచపుండుల రేగుతున్నది అంటరానిభావము...
రాజకీయపు పావు అయినది నిమ్న జన కులవాదము...
ఎన్ని చట్టములున్నగానీ తొలగలేదీ దోషము..
అన్ని వైపుల పేద జనులకు జరుగుతున్నది మోసము !!

సహపంక్తి భోజనమారగించి ఒకటి చేసిన తత్త్వము..
సమరసత లోకానికెపుడో చాటినది హిందుత్వము..
శబరి ఎంగిలి ఆరగించిన రాముడేరా సాక్ష్యము..
అన్ని కులముల పూజలందిన అరుంధతె ఆధారము.  !!

పరమతమ్ములో సమత గలదని మభ్యపెట్టే యత్నము..
హిందుమతమను చందమామలో మచ్చలెంచే కుతంత్రము..
ధనము చూపి దీఅంజనులను మతము మార్చుట దారుణం..
మనము ఒకటే..వేరు కాదని అనకపొవుటే కారణం..!!

బడుగు జీవుల బాధ బాపి తీర్చుకోర నీ ఋణం..
కడను వుంచిన సోదరులతో చెలిమి చేద్దామందరం..
కులము కన్న గుణము మిన్నని తెలిపిదినది మన ధర్మము..
హిందువులలో పతితుడెవ్వడు లేడు లేడని చాటుదాం...!!

Wednesday, June 21, 2017

ఈ 9 లక్షణాలు వుంటే పొందడం కొంత కష్టం. అయితేనేమి.... కొంత కష్టపడితే సాధించవచ్చును.


యోగవిద్య. 
ఈ 9 లక్షణాలు వుంటే పొందడం కొంత కష్టం. అయితేనేమి.... కొంత కష్టపడితే సాధించవచ్చును.
సంస్కారం వున్న మనిషికి యోగవిద్య గురించి కొంతైనా అవగాహన వుండాలి. అహంకారం తలెత్తిందో పతనమే కదా!
1.రోగాలు వున్నవారు 
2. బద్ధకము, సోమరితనము వున్నవారు 
3. ఎప్పుడూ అనుమానాలతో వుండే వారు. 
4. ఎల్లప్పుడూ నిరుత్సాహంగా వుండే వారు 
5. నిరంతరము కోరికలతో వుండే వారు 
6. సరైన జ్ఞానం లేనివారు 
7. ఎప్పుడూ కలలు, భ్రమల్లో వుండే వారు 
8. రకరకాల ఆలోచనలు గలవారు 
9. మానసిక చాంచల్యం, చపలత్వం గలవారు.
ఈ లక్షణాలులేనిదెవ్వరికి? అయితే ఇవన్నీ ఆసనాలు, క్రియలు,భస్త్రిక,స్వాధ్యాయ, ప్రాణాయామము, ధ్యానం ద్వారా ఇవన్నీ నెమ్మదిగా తొలగించవచ్చును.
అందుకే నిరంతర యోగ సాధన మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మనసును అదుపులో పెట్టి, ఆలోచనలు నియంత్రణ చేసి మంచి వ్యక్తులు గా రూపొందాలన్న మన పూర్వీకుల కలలు నిజం చేద్దామా?
- అప్పాల ప్రసాద్.

ఆత్మ తో ఐక్యం చెందడమే యోగ విద్య. యొక్క లక్ష్యం.


పాశ్చాత్య దేశాలలో యోగులు కాగలిగేవారు లేరా? ఎందుకు లేరు?
నిస్వార్థ పరులు, దైవభక్తి వున్న వారు, కోరికలు అదుపులో పెట్టుకొన్నవారు వున్నారు. అయితే వారి జీవితాన్ని ఇప్పటికన్నా మరింత మెరుగైన దారిలో, ఉన్నత స్థితి ని అందుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్న వారికి యోగం అనే నిర్దుష్టమైన శాస్త్రాన్ని అందించేది ముమ్మాటికి భారతదేశమే.
నిజమైన యోగి ప్రపంచానికి విధివిధేయుడై వుంటాడు. నీటి మీద వెన్నముద్ద వలె క్రమశిక్షణతో వుంటాడు. కేవలం సిద్దాంతం మాత్రమే పొందుపరచి లేదు. ఆచరణ సాధ్యము అని నిరూపించిన తర్వాతనే శాశ్వతంగా బాధలు తొలగించి, అక్షయ ఆనందం కలిగించే సమగ్ర శాస్త్రం' యోగం ' ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
ఆధ్యాత్మిక విలువలు కలిగి, ఇతరులను ఎవరినీ హింసించకుండా, సత్య ధర్మాలు పాటిస్తూ, ఇతర దేశాల వస్తువులు ఏవీ దొంగిలించకుండా, ఇతరుల వనరులపై ఆశపడకుండా, కోరికలను నియంత్రించుకొని, తమ మనసులను స్వచ్ఛంగా ఉంచుకొని, వున్నదానితో సంతృప్తి పొందుతూ, సాధన చేస్తూ, ఆత్మ విచారణ జరుపుతూ, భగవంతుడి పై,గురువుపై భక్తి కలిగి, ఆసనములు వేస్తూ, సూక్ష్మమైన ప్రాణప్రవాహాలను ప్రాణాయామము ద్వారా అదుపులో వుంచి, ఇతర వస్తువుల పై కోరికలు లేక, ఏకాగ్రతతో, దైవచింతన లో కాలం గడుపుతూ సమాధి చేతన ను "యోగ విద్య ' ద్వారా ప్రయత్నించి పొందే మహాత్ములు ఎందరో ఈ భూమిమీద కనిపిస్తారు.
భగవద్గీతలో చెప్పిన కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలను సామాన్యులు కూడా అందుకొని, ఆనందించేందుకు వీలుగా ప్రయత్నాలు , పరిశోధనలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే వున్నాయి.
- అప్పాల ప్రసాద్.

'యోగవిద్య ' పై ఆదరణ ' కొత్త మీద కలిగే మోజు ' వంటిది కాదు


1937 లో జరిగిన 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ' సమావేశంలో డా.యూంగ్ పాల్గొని ఆరోగ్యం, దీర్ఘ ఆయవు కోసం ప్రవేశ పెట్టిన శాస్త్రీయంగా నిరూపించిన ఈ విద్యను పాశ్చాత్యులు రానున్న రోజుల్లో ఆదరిస్తారని 1937 లోనే జోస్యం చెప్పారు. డా.యూంగ్ ఒక స్విట్జర్లాండ్ శాస్త్ర వేత్త.
'యోగవిద్య ' పై ఆదరణ ' కొత్త మీద కలిగే మోజు ' వంటిది కాదు. తెలిసీతెలియని వాళ్ళకి వ్యామోహం కొంత వున్నప్పటికీ, శాస్త్ర ప్రమాణాలకు కావలసిన సత్యాలు అన్నీ వున్న ఈ విద్య మానవ జీవితానికీ నిరంతరం ఉపయోగపడుతుంది.రోగాలను నివారించే సూర్యకాంతి అన్ని దేశాలకు సమానంగా ప్రసరించే విధంగా, యోగవిద్య అన్నిదేశాల వాళ్ళకి లాభం కలిగిస్తుంది.చాలా మంది ఆలోచనలు నిలకడలేనివీ, చపలమైనవీ, కనుక మనస్సును అదుపులో పెట్టే యోగవిద్య మానవజాతికి నిస్వార్థంగా సేవ చేయాలని, వ్యక్తిగత ఆకాంక్షలను విడిచిపెట్టి, కుల,మత,వర్గ,వర్ణ,జాతి,లింగ విద్వేష,దురభిమానాన్ని వదలిపెట్టి , భారతీయులు ప్రపంచానికి అందించిన కానుక ఇది.
- అప్పాల ప్రసాద్.

యోగవిద్య


అణుబాంబు దెబ్బ కు ధ్వంసం కాని 'గూడు ' ఏదైనా వుంటే అది 'యోగవిద్య ' మాత్రమే. రాళ్ళు, లోహాల వంటి పదార్థాలలో వున్న శక్తి కన్న, మహత్తరమైన శక్తిని మానవ మనస్సు ల నుండి విడుదల చేయగలరని నిరూపించిన భారత యోగ విజ్ఞానాన్ని ప్రపంచం అంగీకరించి నందువల్లనే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అకస్మాత్తుగా చేసింది కాదిది. దీని వెనక మన పూర్వీకుల కృషి ఎంతో వుంది. వందల సంవత్సరాలుగా చాలా దేశాల్లోకి యోగాచార్యులను పంపి, శరీరాన్ని,మనసు ని సమైక్యంగా వుంచే సంపూర్ణ పద్ధతి ఇదేనని పాశ్చాత్య సైంటిస్టులను, తత్వవేత్తలను ఒప్పించింది.అణు రాక్షస శక్తి ప్రపంచం మీద విరుచుకు పడకముందే యోగశాస్త్రం కాపాడుతుందని , ప్రకృతి లోని వనరులను దోచుకోవడం కాదు ఆత్మ సంయమనము ఎలా పొందవచ్చునో చెప్పగల అంతర్ విజ్ఞానం యోగవిద్య ద్వారా మాత్రమే లభిస్తుందని పాశ్చాత్యులు అంగీకరించారు.

క్రీస్తుపూర్వం రెండవ శతాబ్ది కి చెందిన వాడిగా భావిస్తున్న పతంజలి మహర్షి ఎన్ని యుగాలకైనా కాలదోషం పట్టని, కాలానికి అతీతమైన సైన్సును ,వేదాలనుండి వెలికి తీసి ప్రపంచ ప్రజలకు వరప్రసాదంగా అందించారు. ఈ విద్య ను 'యోగవిద్య ' అని లేదా ' వేదవిద్య ' అని చెప్పాడే తప్ప 'పతంజలి విద్య' అని పేరు పెట్టలేదు. అంతేకాదు పేటెంట్ హక్కుల పేరుతో 'వ్యాపారముద్ర ' వెయ్యకుండా ప్రపంచ ప్రజల ఆస్తిగా ప్రకటించిన మహనీయులు పతంజలి మహర్షి.
- అప్పాల ప్రసాద్.

కష్టాలు సీతారాములకు... ప్రజలందరికీ సుఖాలు-రామాయణం


*లేక లేక జన్మించాడు రాముడు..
*ఇంటికి దూరంగా వశిష్ఠుడి ఆశ్రమంలో వేదవిద్య.
*తండ్రిి వద్దన్నా విశ్వామిత్రుడి తో కారడవికి వెళ్ళాడు.
*పెళ్ళి అయిందో లేదో రాజ్యాభిషేకం చేజారిపోయింది.
*సవతితల్లి కైక ,దాసి మంధర వల్ల కుటుంబం లొ చిచ్చు.
*14 ఏళ్లు అడవి లో జీవనం. రాజ్య సుఖాలకు దూరం.
*రోజూ అడవిలో రాక్షసులు, భయంకర మృగాల బాధలు.
*అడవిలో వున్నప్పుడే తండ్రి వేదనతో మరణం.
*భార్య సీతమ్మ అపహరణ, చెట్టు, పుట్టతో వేడికోలు.
*రావణుని తో యుద్దం, వేలాది వానరుల మరణం.
*ఎవరో ఏదో అన్నారని సీతమ్మను అడవిలో వదలటం.
*సీతమ్మ కు జన్మించిన లవకుశుల ప్రేమ కు దూరం.
*సీత బొమ్మ తో యాగం,కొడుకులతొ యుద్ధం.
*జీవితమంతా కష్టం..అయినా రాముడంటేనే ఇష్టం.
రామాయణం లో సీతా రాములకు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు , ఎన్నో అడ్డంకులు అయినా మనస్సు,బుద్ది అదుపు తప్పలేదు. ప్రశాంతంగా అందరితో క్రమశిక్షణ తో, ప్రేమ తో వ్యవహరించారు. ఎవరినీ పరుషంగా,కోపం తో తిట్టలేదు.హృదయం లోనే వేదనలు దిగమ్రింగారు.
రాముడు తండ్రి మాటపై నిలిచాడు. సవతి తల్లి కైకను కూడా పల్లెత్తు మాట అనలేదు.భరతుని అపహాస్యం చేయలేదు.లక్ష్మణుడికి అడుగడుగునా మార్గదర్శకంగా నిలిచాడు. గుహుడిని నిషాదరాజుగా ఆదరించి స్నేహం చేశాడు. ఋషులను,ఋషిపత్నులకు నమస్కరించాడు. హనుమంతుని మధురంగా పలకరించాడు. పక్షి జటాయువుని , శబరిని, సుగ్రీవుని , అహల్యను , విభీషణుని ఆశీర్వదించాడు. రావణుని రాజుగా గౌరవించి, రాయబారం నెరిపాడు. చివరకు హతమార్చి, స్వర్ణలంక ను ధర్మంగా విభీషణుడికిచ్చి, అయోధ్యకు పయనమయ్యాడు.
తనకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞత చూపాడు.అన్ని జీవరాసులతో హితంతో మెలిగాడు. ఎవరి పట్ల అసూయ లేకుండా, తానే ముందుగా అందరినీ పలకరిస్తూ నడిచాడు. ప్రజలకు కష్టాలు రాకుండా పాలించి,రామరాజ్యం తెచ్చాడు.
( ఈ క్రింది నాణెపు బొమ్మ 1839 లో ఈస్టిండియా కంపనీ ముద్రించినది. ఈ నాణెములో సీతారామలక్ష్మణ,హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. ఇది అణా నాణెము..అంటే అప్పట్లో ఆరు పైసలు ).
- Appala Prasad.

రామాయణం నిత్యం మనలో కదలుతున్న అపురూప కథాచిత్రం


రా' అంటే కాంతి, ' మా' అంటే నా హృదయం లో...నా హృదయం లో నెలవున్న .. రామా అంటే .. నాలో దాగి వున్న వెలుగు,ప్రతిభ,జ్ఞానాన్ని వెతుక్కోవడం...
దశరథుడు అంటే దశ అంటే పది..5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిసి వున్న రథం అంటే ఈ శరీరాన్ని, కౌసల్య అంటే నైపుణ్యం తో నడిపితే జన్మించినదే..ఆత్మ జ్ఞానపు వెలుగు( శ్రీ రాముడు )..
ఆత్మ సాధనలో మనస్సు(సీత) స్థిరంగా వుండాలి. కానీ, మనస్సు ని(సీత) అహంకారం (రావణుడు ) దొంగిలిస్తాడు. అప్పుడు ఆత్మారాముడు అశాంతి కి గురవుతాడు. అప్పుడు శ్వాస (హనుమంతుని) సహకారంతో , జాగరూకత (లక్ష్మణుడి) తో అహంకారం (రావణుని ) ను నిర్మూలించి మనస్సు (సీతను)ను ఆత్మ వద్దకు తీసుకుని వెళ్తే శాంతి లభిస్తుంది. జాగరూకతతో మనస్సును స్థిరంగా నిలిపి, శ్వాస(ప్రాణాయామము ) సహాయంతో మనలో వున్న ఆత్మారామున్ని దర్శించవచ్చును. ఇదే ఆధ్యాత్మిక, వేదాంత రామాయణం లోని సారాంశం.
'రామా ' అని పలికి,పలికి వాల్మీకి జ్ఞానోదయం పొంది, లోక క్షేమానికి రాముని కథను అందిస్తాడు.
'రామా ' అని ధ్యానించిన శబరి ముక్తి ని పొందుతుంది.
'రామా ' అని జపించిన అహల్య రాయి (జడత్వం )నుండి చైతన్యం పొందుతుంది.
'రామా ' అన్న నామ జపంతో వానరులు కష్టాల వారథి ని దాటుతారు.
'రామా ' అని శరణుపొందిన విభీషణుడు లంకా రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఏలుతాడు.
'రామా ' అనటమే కాదు రామ కార్యం నిర్వహించి, హనుమంతుడు అందరి గుండెల్లో నెలవై వున్నాడు.
గమ్మత్తేమిటంటే రామా రామా యని ద్వేషంతో, కోపంతో వున్నంతకాలం నిద్రాహారాలు లేక మద, మాత్సర్యాలతో తలుచుకుని, హతుడై, రావణుడు చివరకు చేరింది రాముని వద్దకే అని ఎందరికి తెలుసు.?

- Appala Prasad.

Saturday, June 17, 2017

Ramayanam-అయిన వాళ్లు చెప్పినా వినని రావణుడు కుక్క చావు చచ్చాడు


అయిన వాళ్లు చెప్పినా వినని రావణుడు కుక్క చావు చచ్చాడు.
తన ఆత్మీయులందరినీ దూరం చేసుకున్నాడు.
రావణుడు , మారీచున్ని పిలిచి మాయలేడి వేషం వేసి, సీతను ఎత్తుకొని రావటం లో దుష్ట పాత్ర పోషించాలని ఆదేశించాడు. మారీచుడు ఏమన్నాడో తెలుసా?
'రామో విగ్రహవాన్ ధర్మ: ' ---ధర్మానికి ప్రతీక శ్రీ రాముడు' అని మారీచుడు పలుకుతాడు. అతనితో కొట్లాట వద్దని సలహా ఇస్తాడు. రావణుడు వినలేదు.
యుద్ధ సమయంలో కుంభకర్ణుని నిద్రలేపగానే అప్పుడు ఆ కుంభకర్ణుడు ఏమన్నాడో తెలుసా?
'ఎవరిని సంప్రదించి సీతను ఎత్తుకొచ్చి,ధర్మ విరుధ్దమైన పని చేశావు ?' మంత్రులతో, మిత్రులతో చర్చించ వద్దా అని మందలిస్తాడు. రావణుడు వినలేదు.
భార్య మండోదరి ఎంతగానో నచ్చచెప్పినా రావణుడు వినలేదు.
తమ్ముడు విభీషణుడు, 'సీతను ఎత్తకొని రావటం మంచిది కాదని,తిరిగి ఇచ్చేయమని ' సూచించినా రావణుడు వినలేదు.
రాముడు వెంటనే యుద్దానికి దిగలేదు. ఆంజనేయుడు ఎన్నో నీతులు చెప్పాడు. అంగదుడు రాయబారిగా వచ్చి రావణుని కి అర్థం చేయించే ప్రయత్నం చేసినా లాభం లేదు.
రావణుడికి బ్రహ్మ విద్యలెన్నున్నా, నీతి,విలువలు కోల్పోయిన కారణంగా ,ధర్మానికి నష్టం కలుగుతున్నందున, శ్రీ రాముడు రావణుని చంపి, బ్రాహ్మణుడు కావున బ్రహ్మ హత్యా పాతకం అంటకుండా ఇసుకతో శివలింగం తయారు చేసి అభిషేకం చేస్తాడు.
రావణుడిపై శాశ్వత శత్రుత్వం చూపకుండా,మంచి మాటలు చెప్పి చూసి , వినకపోతేనే సంహరిస్తాడు.
రావణుని శవానికి అంత్యక్రియలు జరిపించి, విభీషణుడికి రాజ్యం అప్పగించి తరువాతనే అయోధ్య కి వెళ్తాడు.
అటువంటి రావణుని "మా దళితుడని, రామునిది ఆక్రమణ బుధ్దని, మేము రావణాసురుని వారసులమని ' ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగంగానే పత్రికా ప్రకటన ఇచ్చిన వ్యక్తి.ఆయన ఏలుబడిలో ఎంతమంది గురుకుల విద్యార్థులను రావణులను చేయ దలిచాడో భవిష్యత్తు లో తెలుస్తుంది. తమ్ముడు విభీషణుని ధర్మం చూసి, ,ఆయన పక్షం వహించరెందుకు? స్త్రీ మూర్తి ని వక్ర దృష్టి చూసే రావణుని పై అంత ప్రేమ ఎందుకో? కాలం జవాబు చెపుతుంది.
- Appala Prasad.

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers