వల్లభి గ్రామం (ముదిగొండ మండలం) లో శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో పూజారులు.అంతేనా? మాదిగ కులం లో పుట్టినప్పటికినీ భక్త్రి శ్రద్ధలతో 1947 నుండి వీరి తాత తండ్రుల కాలం నుండి పరంపరగా అర్చన చేస్తున్నారు. తాత పేరు ముత్తయ్య. మనవడి పేరు అనంత రాములు.ఖమ్మం నుండి 20 కిలో మీటర్ల దూరం లో వున్న వల్లభి గ్రామ దేవాలయం లోనికి అన్నికులాల ప్రజలు ప్రవేశించి ఈ అర్చకులతో పూజలు చేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు.
మద్య మాంసాలకు దూరంగా , అత్యంత భక్తి శ్రద్ధలతో వూర్లో భక్తి వాతావరణం తేవటం లో ప్రధాన పాత్ర పొషిస్తున్నారు. అలాగే సన్మనం అందుకున్న మరొక మాతృమూర్తి మాణిక్యేశ్వరి మాదిగ కులం లో జన్మించినా , హిందూ ధర్మ ప్రచారం చేస్తూ భగవంతుని సేవ చేస్తున్నది.
ఈ ముగ్గురిని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.వంశ తిలక్ గారు, డా వడ్డి విజయసారథి గారు, శ్రీ వెంకటేశ్వర్ రావ్ గారు శాలువతో సన్మానించి, 20 మండలాల నుండి వచ్చిన సభ్యులందరికీ వారి గొప్ప దనాన్ని వివరించి చెప్పారు..
ఆ తాతా మనవల కోరిక ఏమిటంటే ...70 ఏళ్ళ ఆ దేవాలయ నిర్వహణ, దేవాలయం ఎత్తు పెంచడానికి ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నారు. ఆ 80 ఏళ్ళ వయసున్న అర్చకుడు తన కళ్ళతో ఆ దేవాలయ వైభవాన్ని చూద్దమన్న ఆకాంక్షను వెలిబుచ్చటం చూస్తుంటే ఆయనకు భగవంతుని సేవ తప్ప మరొక స్వార్థపు కోరిక ఆయన మనసులో లేదని ఎంత స్పష్టంగా తెలియచెస్తుందో కదా.
ఈ తాతా మనవలను ఖమ్మం జిల్లా సామాజిక సమరసతా వేదిక ఆగస్ట్ 28 న ఆదివారం సన్మానించింది
ReplyDelete