Friday, September 25, 2015

దళిత యోగులు


యోగం అంటే మనుషులకు మాత్రమే కాదు,అన్ని ప్రాణులకు,అలాగే ప్రకృతికి కూడా హాని చేయకుండా ఈ సృష్టి పురుషునితో తాదాత్మ్యత చెందుతూ జీవించడం.అలా జీవించారు వీరు. కులం కాదు..మంచి చెడులు చూడాలి.జ్ఞానం ముఖ్యం.అంటరాని వారనే కులం లో పుట్టినా కూడా జ్ఞానం సంపాదించి అన్ని కులాల వారి చేత పూజలందుకుంటున్న దళిత యోగులు వీరు.కులాల పేరుతో కొట్లాటలు,కుల దురహంకారంతో అలమటిస్తున్న నేటి ఆధునిక కాలం లో దళిత యోగులను వెలుగులోకి తెచ్చారు సవ్వప్ప గారి ఈరన్న అనే రచయిత( ఇంటి నెంబర్ 15/58-సి ,యస్.ఆర్.పేట,పత్తికొండ-518380 కర్నూల్ జిల్లా ) . అన్ని కులాలు సామరస్యంగా జీవించాలని సెలవిచ్చారు.
1. సంత్ రవిదాస్(కాశీ,ఉత్తరప్రదెశ్) చెప్పులు కుట్టే వృత్తిలో జన్మించి,కాశీ లో అందరికి గురువై పూజలందుకున్నడు.కులం ఏదైనా జ్ఞానం ముఖ్యమని శ్రీ కృష్ణుని ఆరాధించాడు. 1527లో భక్త మీరాబాయి ఈయన శిష్యురాలైంది.డిల్లీని పాలించిన సుల్తాన్ సికిందర్ ఈయన భక్తుడు.కాశీ లో బ్రాహ్మణులు పెట్టిన పరీక్షల్లో నెగ్గి,అధ్భుతాలు చేసి అన్ని వర్గాలకు ఆరాధ్యుడయ్యాడు.ఇప్పటికీ కాశీ లో సంత్ రవిదాస్ పీఠముంది.
2. మహాయోగి లక్ష్మమ్మ అవ్వ(ముసాను పల్లె,ఆదోని,కర్నూల్ జిల్లా).బేగరి కులం లో జన్మించిన చిన్న లక్ష్మవ్వ కులభేదం లేకుండా అన్ని వర్గాల పూజలందుకుంటున్నది.రాయ చోటి రామయ్య అనే వైశ్యుడు ఈమెలోని గొప్ప శక్తులను గమనించి,ఆమెను ఇంటి దేవతగా పూజించాడు.బ్రతికున్నప్పుడు ఆమెకు సపర్యలు చేశాడు..ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు.ఆత్మ ధ్యానం లో వుండేది.గ్రామంలో జరిగే మంచి,చెడు సంఘటనల సమయం లో వెంటనే స్పందించేది.అప్పుడు ఆమె నోటినుండి ఏది చెపితే నిజమయ్యదని ప్రజలు చెపుతారు.ఆమె 118 సంవత్సరాలు జీవించింది. ప్రతి వైశాఖ మాసంలో ఆమె పెరుతో రథం వూరేగింపు జరుగుతుంది.
- అప్పాల ప్రసాద్.

2 comments:

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers