ఈ చెల్లెలు పేరు సరిత...యాదవ కులంలో పుట్టి, మాల కులానికి చెందిన ఇంద్రాల మల్లేశం ఇంట్లో ఆ అన్నయ్యకు బొట్టు పెడుతుంది చూసారా. ఆశ్చర్యమేముంది.. అంటారా. పెళ్ళి కూతురుగా తీర్చిదిద్దే కార్యక్రమమంతా మల్లేశం ఇంట్లొ జరిగితే,వూర్లో వున్న వారికి ఆత్మీయుడైన వాడు ఇంద్రాల మల్లేశం.అన్ని కులాల కు చెందిన ఇళ్ళలో వివాహాలు జరిగే సందర్భం లో పెళ్ళి కూతురు ను అలంకరించే కార్యం మాత్రం ఇంద్రాల మల్లేశం ఇంట్లో జరుగుతుంది. అన్ని కులాల వారి విశ్వాసాన్ని చూరగొన్న మల్లేశం ధన్యుడు. ఇప్పటి వరకు 20 మంది కి పెళ్ళి కూతురులుగా తయారుచేశారు. మల్లేశం అమ్మగారు , చెల్లెలు పూర్తిగా సహకరిస్తూ సమరసతా దృక్పథాన్ని చాటి చెప్తున్నారు.
.నేరెళ్ళ గ్రామం ( కరీం నగర్ జిల్లా, ధర్మపురి మండలం ) లో ఇంద్రాల మల్లెశం కులం ఎవరూ అడగరు..వూరంతా ఆయనను అన్నా అని పిలుస్తారు. యాదవ, బెస్త, మంగలి, మున్నురు కాపు, ముదిరాజు, పద్మశాలి కులానికి చెందిన మహిళలు సుమారుగా 150 మంది, మల్లేశం యొక్క బీడి కంపనీ లో పనిచేస్తారు. 10 సంవత్సరాల క్రితం ఈయన కంపనీలో 40 మంది పని చేస్తూ , ఈయన తక్కువ కులానికి చెందినవాడని 10 మంది వరకు రాజీనామ చెసి వెల్లిపోయారు..కాని మెల్లి మెల్లిగా ఇంద్రాల మల్లేశం తన సామరస్య వ్యవహరం తో వూరి ప్రజల మనసు గెల్చుకున్నాడు.150 మందికి పైగ పనికోసం చేరారు.
ప్రతి ఉగాది పండుగ రోజున అలాగే రాఖీ పండుగ రోజున బీడి కంపనీ లోని కార్మికులు అందరూ కలిసి ఉల్లాసంగా సామూహికంగా పాల్గొంటారు. ఆ పండుగల వెనక వున్న సామాజిక ఉద్దేశ్యాన్ని వారికి తెలియ చేస్తాడు.
ఒకానొక సమయం లో అవమానానికి గురైనా, గ్రామం పై, ఇతర కులాలపై కక్ష, కసి పెంచుకోకుండా,అందరి మన్ననలు పొందిన ఇంద్రాల మల్లేశం ఇప్పుడు ఎం పి టి సి గా పని చేస్తూ తన మృదు స్వభావాన్ని మాత్రం మాన లేదు. అతని కులం, అతని రాజకీయ పదవి కంటె అతనికి పేరు వచ్చింది అతని సామరస్య భావన వల్లనే..
- అప్పాల ప్రసాద్.
ఈ చెల్లెలు పేరు సరిత...యాదవ కులంలో పుట్టి, మాల కులానికి చెందిన ఇంద్రాల మల్లేశం ఇంట్లో ఆ అన్నయ్యకు బొట్టు పెడుతుంది చూసారా
ReplyDelete