Thursday, June 16, 2016

పుట్టింది వైశ్య కుటుంబమైనప్పటికినీ, అందరినీ సాక్షాత్తూ భగవత్ స్వరూపులుగా చూసే స్వభావం ఈ కుటుంబానిది


పుట్టింది వైశ్య కుటుంబమైనప్పటికినీ, అందరినీ సాక్షాత్తూ భగవత్ స్వరూపులుగా చూసే స్వభావం ఈ కుటుంబానిది.
మొన్న ఉగాది రోజున ఒక చక్కని సంప్రదాయానికి నాంది పలికారు..అదేమిటంటే తమ ఇంట్లో వివిధ రకాల పనులు చేసే వారిని, చాకలి, మంగలి,మాల,రెడ్డి,కమ్మ వారి కుటుంబాలను పిలిచి స్వయంగా వడ్డించి, విస్తర్లు ఎత్తి,అందరినీ సమదృష్టి తో చూడాలన్న ఆలోచనకు ఆచరణ రూపాన్ని కలిపించారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద నున్న 'సార పాక ' గ్రామం లోని సూర్య కుమారి,సుబ్రహ్మణ్యం దంపతులు సేవా భావం లో ఉన్నతులు. ఏ పండుగ వచ్చినా అందరినీ తమ సంతానంగా భావించి,సేవించే మానవతామూర్తులు. 35 ఏళ్ళుగా సార పాక లో శ్రి రామ కళ్యాణం,హనుమజ్జయనటి, ముక్కోటి ఏకాదశి,ఉగాది, దసరా పండుగ లో రోజున సామూహిక భొజనం, మజ్జిగ వితరణ, ఇంటింటా రామాయణ ప్రవచనం వంటివి రాష్ట్ర సేవికా సమితి, సేవా భారతి పేరున నిర్వహించే సంప్రదాయం నెలకొల్పారు.
చేసేది చిన్న వ్యాపారం అయినా ఏదో ఒక వ్యాపకం పెట్టుని సేవ చేయాలన్నదే వీరి తపన.

- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. పుట్టింది వైశ్య కుటుంబమైనప్పటికినీ, అందరినీ సాక్షాత్తూ భగవత్ స్వరూపులుగా చూసే స్వభావం ఈ కుటుంబానిది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers