Thursday, June 16, 2016

ఈ గుడి లో మాదిగలే పూజార్లు


కులం ఏదైతేనేమి? అర్చకుల స్థానమే పవిత్రమైనది..భక్తి తో ఆరాధించి అర్చిస్తే చాలు..భగవంతుడు మనకు తోడు నిలుస్తాడు.
ఖమ్మం జిల్లా లోని ముదిగొండ మండలం 'వల్లభి ' గ్రామం..70 సంవత్సరాల నాటి సీతారామాంజనేయులు దేవాలయం.1947 లో నిర్మించిన ఈ గుడి కి మొదటి నుండి రామయ్య నే పూజారి.ఆయన కొడుకు ముత్తయ్య 80 సంవత్సరాల వయస్సు ఇప్పుడు పూజారిగా వుంటూ, తన మనవడు అనంతరాములు కి అర్చక శిక్షణ ఇచ్చాడు.తాతా మనవలు ఇద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో రాములవారిని అర్చిస్తారు.మాంసాహారం మానేశారు..మంచి ఉచ్చారణతో మంత్రాలు చదువుతారు.వీరి భక్తి కి మెచ్చి భగవంతుడు మంచి బుద్ధిని, ఉదార హృదయాన్ని ఇచ్చారు.
వూర్లో వున్న యాదవులు, పద్మశాలీలు,కమ్మ, రెడ్డిలు,గౌడ,చౌదరీ లు,మిగతా బిసి కులాల ప్రజలు గుడి ని దర్శిస్తారు.ప్రతి శనివారం పిల్లలు,మహిళలతో సహా అందరూ చక్కని భజన చేస్తారు.
శ్రీ రామ కల్యాణం వేళ అన్ని కులాల ప్రజలు సందర్శిస్తారు.సూరపల్లి రామ క్రిష్ణ గారి తాతయ్య ఈ దేవాలయ నిర్మాణానికి అప్పట్లో భూమి ఇచ్చారు.5 వేల జనాభా కలిగిన ఈ వల్లభి గ్రామం లో అందరూ కలిసి మెలిసి వుంటారని ఈ దేవాలయం కథ తెలిసిన వారెవరికైనా ఇట్లే అర్థమవుతుంది.
70 ఏళ్ళ నాటి ఈ దేవాలయం ప్రాంగణం ...వూర్లో రోడ్ల కంటే కొంత క్రిందికి వుంటుంది..గ్రామ ప్రజల కోరిక ఏమిటంటే ఈ దేవాలయం ఎత్తు పెంచడానికి ఆర్థిక సహకారం కావాలని..


- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ఈ గుడి లో మాదిగలే పూజార్లు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers