సమరసతా సాధనలో స్పూర్తి నింపుతున్న సంస్కర్తలు ఒక వైపు...
సామరస్యాన్ని మంట కలుపుతున్న ఆధునిక రావణ, నరకాసుర, మహిషాసుర వారసులు మరో వైపు..
డా పి.భాస్కర యోగి మహబూబ్ నగర్ జిల్లాలొ జన్మించి, యోగ దీక్ష స్వీకరించి ఒక రచయితగా సామాజిక సుమ సౌరభాలు వెదజల్లేందుకు ఎందరో గొప్ప సంస్కర్తల జీవితాలను గ్రంధస్థం చేసి ' సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు ' అను పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, ఇప్పటి సామాజిక ఉద్యమకారులకు ఒక కరదీపికగా అందించిన మహనీయులు డా భాస్కర యోగి.
ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు.
సామాజిక సమరతా సాధనలో శ్రీయుతులు మహాత్మ జ్యొతిబా ఫూలె, సావిత్రి బాయ్ ఫూలె,ఆది హిందూ భాగ్యరెడ్డి వర్మ,మహాత్మా గాంధిజి, పూజ్యులు డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్, శ్రి గోల్వాల్కర్, బాలా సాహెబ్ దేవరస్ వారి నేతృత్వం లో ఆర్ ఎస్ ఎస్,అలాగే బుద్ధుడు మొదలుకొని ఇప్పటివరకు ఎందరో మహాను భావులు గొప్ప సంస్కర్త ల కృషి అనుపమానమైనది.
ఈ విశాల సమాజం లో కొన్ని వికృతులు, వికారాలు ఉద్భవించినా కూడా, వాటి నిర్మూలనకు తక్కువ ప్రయత్నమేమీ జరుగలేదని, తమ జీవితాలనే ధారపొసిన చరిత్ర సంఘటనలెన్నో వున్నట్లుగా చరిత్ర సాక్ష్యం చెపుతుంది.
సమాజాన్ని కలిపి వుంచడానికి ఒకవైపు కృషి జరుగుతుంటే, మరో వైపు కొందరు మూర్ఖ మేధావులు, విదేశీ కనుసన్నల్లో పని చేసే విద్యావంతులు సమాజాన్ని చీల్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు..దానికి ఆజ్యం పోసి మరింత విచ్చిన్నానికి గురిచేస్తున్న కొన్ని మీడియా శక్తుల ప్రభావం తక్కువేమీ కాదు..వీళ్ళందరు అంబెద్కర్ బొమ్మ, బుద్ధుడి పేరు పెట్టుకుని,భారతీయతను, హిందూ సంస్కృతిని దుమ్మెత్తి పొస్తున్నారు..ఇవన్నీ బ్రిటిష్ వారు చొప్పించిన విధానాల కొనసాగింపు మాత్రమే..ఆశ్చర్యమేమీ లెకున్నా తోటి నిమ్న వర్గాలను జాతీయ జీవన స్రవంతి లో కలపటం కంటే వేర్పాటు బీజాలు నాటుతూ ఈ దేశీయులే చేస్తున్న హాడావిడి, దేశ శ్రేయస్సు కోరేవారికి బాధ కలుగుతుంది.
- అప్పాల ప్రసాద్.
సమరసతా సాధనలో స్పూర్తి నింపుతున్న సంస్కర్తలు ఒక వైపు...
ReplyDeleteసామరస్యాన్ని మంట కలుపుతున్న ఆధునిక రావణ, నరకాసుర, మహిషాసుర వారసులు మరో వైపు.