Wednesday, June 8, 2016

రాం మనోహర్ లొహియా, సానే గురూజి మరియు వీర సావర్కర్..ఆచరణ లో సమరసత




రాం మనోహర్ లొహియా, సానే గురూజి మరియు వీర సావర్కర్..ఆచరణ లో సమరసత...

అ) రాం మనోహర్ లోహియా..

1930 లో వైశ్య కుటుంబం లో జన్మించిన సంస్కర్త,స్వాతంత్ర్య యోధుడు శ్రీ రాం మనోహర్ లోహియా స్త్రీల హక్కులకు కృషి చేశాడు.

సనాతన సంప్రదాయాల వల్ల ఏర్పడ్డ అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాడు.శూద్రులు,స్త్రీలు రాజకీయం లోకి రావాలని కోరాడు.

సహపంక్తి భోజనాలు,వర్ణంతర వివాహాలను ప్రొత్సహించాడు.

అందరికీ ఆలయ ప్రవేశం గురించి పోరాడాడు.

ఐతే,హిందూ ధర్మం మీద ద్వేషం తో బురద జల్లే పద్ధతులను మారుకోవాలని హిందూ వ్యతిరేకి రామ స్వామి నాయకర్ కి సలాహ ఇచ్చాడు.ఉత్తర భారత్ పట్ల, హింది పట్ల, బ్రాహ్మణుల పట్ల కసి ని పెంచుకోవడం సరియైనది కాదని,సమాజానికి అది మేలు చేయదని చెప్పాడు.

ఆ) సానే గురూజి

రచయిత, సామాజిక కార్య కర్త సానే గురూజి విఠల భక్తుడు.1899-1950 మధ్యలో గాంధిజి పిలుపు మేరకు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నాడు.15 నెలలు జైళ్ళో వున్నాడు. పండరీపురం దేవాలయం లోకి అన్ని కులాలవారిని ప్రవేశం చేయించాలని ఉద్యమించాడు.

అందరికీ ఆలయ ప్రవేశం కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.మహరాష్ట్ర అంతటా పర్యటించి గాంధిజి,అంబేద్కర్ లకు ఇచ్చిన మాటకు కట్టు బడి, అస్పృశ్యతా నివారణకు కృషి చేసిన గొప్ప వారు.

ఇ) వీర సావర్కర్

1927 డా అంబేద్కర్ మహద్ చెరువు ఉద్యమాన్ని బహిరంగంగా మద్దతిచ్చారు.

అన్ని కులాల విద్యార్థులు చదువుకునే విధంగా పాఠశాలలు ప్రారంభించాడు.

రత్నగిరి జిల్లాలో సామాజిక కార్యక్రమాల ద్వార అస్పృశ్యతా నివారణకు కృషి చేశాడు.

భంగీ కులం వారి ఇళ్ళకు పురోహితులను పంపి పూజలు చేయించాడు.

ఆ జిల్లాల్లో పతిత మందిర దేవాలయాలను స్థాపించి, అందులో పాకీ పనివారిని ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి పూజారులుగా నియమించాడు. ఆజీవన పర్యంతం హిందూ ధర్మ రక్షణకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అలాగే మహా స్వాతంత్ర్య సమర యోధుడు కూడా..
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. రాం మనోహర్ లొహియా, సానే గురూజి మరియు వీర సావర్కర్..ఆచరణ లో సమరసత...

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers