Thursday, June 2, 2016

సమదృష్టి కలిగిన నర్సిమెహతా మరియు శ్రీ రామానందుడు



1414 నుండి 1540 మధ్యలో గుజరాత్ లో జన్మించిన నరసీ మెహతా కృష్ణ భక్తి ని ప్రచారం చేశారు..ఒక నిమ్న వర్గానికి చెందిన వ్యక్తి తన వాడలో ప్రచారం చేయమని కోరుతాడు.నర్సీ మెహతా గీతాలు ఆలాపిస్తుంటే సవర్ణులు దాడి చేసి గాయపరుస్తారు.మనుష్యుల మధ్య కుల గోడలు తొలగి,మానవత్వం పరిమళించాలని బోధించాడు. పరాయి వారిని పీడించేవాడు, పరుల దుఖాన్ని పోగొట్టేవాడు,తన మీద తనకు దురభిమానం లేని వాడే నిజమైన వైష్ణవుడని,పరస్త్రీలను తల్లిగా భావించేవాడు,పరధనాన్ని గడ్డిపోచగా చూసేవాడు,కోరికలకతీతుడు,సత్యం పలికేవాడే వైష్ణవుడని అర్థం వచ్చే గీతాలను పాడుతూ ప్రచారం చేశాడు నర్సీ మెహతా.

శ్రి రామానందుల వారు
1299 నుండి 1448 మధ్య పుట్టిన రామానందుడు సమత ను సాధించాడు.

కబీర్ పద్యాలు సామాజిక ఉద్యమానికి, రామ భక్తి కి ప్రేరణనిచ్చాయి.
రామానందుని శిష్యుడిగా ఎదిగి,అసమానతలను కడిగివేసిన సాధువు.
గురునానక్ రామానందుని నుండే స్ఫూర్థి ని పొందాడు.
భగవంతుని పూజించడానికి కులమెందుకు అడ్డు అవుతుంది?

రామానందుని శిష్యుల్లో ఒకరు ఝాట్ కులానికి చెందిన ధన్నా, చర్మకరుడు సంత్ రవిదాస్,పద్మశాలి భక్త కబీర్,మీరా బాయి,సంత్ పీప వంటి క్షత్రియులు ..ఇలా అన్ని కులాల వారికి శ్రిరాముని భక్తి జ్ఞాన గంగ ను అందించాడు. మరి శ్రి రామానందుల వారు సాక్షాత్తు శ్రి మత్ రామానుజాచార్యుల శిష్యులే..
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమదృష్టి కలిగిన నర్సిమెహతా మరియు శ్రీ రామానందుడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers