1368-1518 మధ్య జీవించిన సంత్ కబీరు సాలె కుటుంబం లో పుట్టి,1000 పైగా దోహాలు(పద్యాలు) వ్రాసి అన్ని మతాల్లోని అంధవిశ్వాసాలను తూర్పార బట్టాడు.
తెలుగులో వేమన వలే,సూటిగా , సరళంగా అందరికీ హత్తుకునే విధంగా దోహాలు వ్రాసాడు కబీర్.హరిజనులను ప్రేమించాలని, ఎవరినీ కులభేదం తో చూడొద్దని చెప్పాడు.అందరిని సమంగా చూడాలని తన దోహాల ద్వారా దేశమంతా చాటి చెప్పాడు.
గురు నానక్
1469 లో పుట్టిన గురు నానక్ 40 ఏళ్ళు సంచారం చెసారు. ఒకవైపు ముస్లిముల అగడాలు,మరో వైపు హిందువుల్లోని చాదస్తుల ధోరణులతో ధర్మ నాశనం జరుగుతుంటే సహించలేక పోయాడు.ధర్మ రక్షణకు, అట్టడుగు వర్గాల వారిని ఆదుకోవడానికి సిక్ఖు మతం ప్రారంభించాడు.గురునానక్ తరువాత 9 మంది గురు పీథం ఎక్కారు. 1708 లో ఔరంగ జేబును ఎదుర్కోవడానికి గురుగోవింద్ సింగ్ ఖాల్సా పంథాను ప్రారంభించి,జాట్, చాకలి, మంగలి, వంటవాడు, క్షత్రియుడు మొదలైన కులాలనుండి 5 గురిని ఎంపిక చేసి,జాతి రక్షణకు నడుము కట్టాడు.సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పాడు..
అన్ని కులాల ప్రజల ఆకలి తీర్చడానికి, ఎల్ల వేళలా నడిచే సామూహిక భోజన కార్యక్రమం పెరుతో లంగరు పెరుతో మొదలు పెట్టారు..
- అప్పాల ప్రసాద్.
భక్త కబీర్ మరియు గురు నానక్ ల సమతా హృదయం
ReplyDelete