Thursday, June 2, 2016

నిమ్న వర్గాల సేవలో పుణ్యం పొందిన ఏకనాథుడు


1533 లో పుట్టిన సంత్ ఏకనాథుడు 12 ఏళ్ళ వయస్సులోనే భాగవతాన్ని సంస్కృతం లో చదివాడు. రాము అనే నిమ్న వర్గానికి చెందిన వ్యక్తి తన ఇంటికి భోజనానికి ఏకనాథున్ని పిలిస్తాడు..సవర్ణులు ఎలాగైనా సరె ఏక నాథుణ్ణి కుల బహిష్కరణ చేయాలని రాము ఇంటికి చూడటానికి వస్తారు.ఇంట్లో నుండి ఎంతకు రాకపోయేసరికి ఏకనాథుని ఇంటికి వెల్లి చూసారు.అక్కడ భాగవతం చెప్తూ కనిపించాడు.అనుమానం వచ్చి రాము ఇంటికి వెళ్ళారు.అక్కడ కూడా తింటూ కనిపించాడు. తిన్నది ఒక్కరే. రెండు చోట్లా చూసి ఏకనాథుని గొప్పతనం తెలుసుకున్నారు.

పితృదేవతల కోసం శ్రాధకర్మలను నిర్వహిస్తూ మొదటగా దారిలో ఆకలితో పొతున్న నిమ్న వర్గాల వారిని పిలిచి భోజనం పెట్టాడు.దాంతో సవర్ణులు కోపగించి వెళ్ళిపోయారు..నిజంగానే ఏకనాథుని పితృదేవతలు ఇంట్లో తింటూ కనిపించారు...

తండ్రి సంస్కృతంలో ప్రవచనాలిస్తే, ఏకనాథుడు మరాఠీ భాషలో భక్తి ప్రవచనాలిచ్చాడు..

ఒక వృద్ధ స్త్రీ ఇంటికి భోజనానికి వెల్తే వెంట కొడుకును తీసుకుని వెళ్ళాడు.ఆమె వెయ్యి బ్రాహ్మణులతో సమానం అంటూ ఏకనాథున్ని పొగిడింది.తిన్న తరువాత విస్తరు ఎత్తాలని తన కొడుకు కి చెప్పాడు.ఒక విస్తరు ఎత్తితే,మరొకటి వస్తుంది..ఇలా వెయ్యి విస్తర్లు ఎత్తాడు.వెయ్యి విస్తర్లు చూపించి పుణ్య ఫలం ఎటువంటిదో నిరూపించాడు.

నిమ్న వర్గాలకు చేసిన సేవతో భగవంతుడు ఆయనకు పుణ్యాన్ని ప్రసాదించాడు.కుష్టు వ్యాధితో బాధ పడుతున్న ఒక బ్రాహ్మణుడికి తన పుణ్యం ధారపోసి, కుష్టు వ్యాధి నయం చేసిన మహానుభావుడు ఏకనాథుడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. నిమ్న వర్గాల సేవలో పుణ్యం పొందిన ఏకనాథుడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers