Thursday, June 2, 2016

సమరసతలో ఎంతో ఎత్తుకు ఎదిగిన రామానుజుడు


ఎత్తైన గోపురమెక్కి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అన్ని కులాలకు బోధించాడు.

గోష్టి పూర్ణులు అనే గురువు మానవ జాతి విముక్తి కోసం ఆనంద మయ మంత్రాన్ని రహస్యంగా ఒక రామానుజుడికే బోధించి, మిగతా కులాలకు చెపితే నరకానికి వెళ్తావని హెచ్చరిస్తాడు.

దానికి భిన్నంగా ప్రజలందరిని పిలిచి,మరీ ఎత్తైన శిఖరమెక్కి,తాను నరకానికి వెళ్ళినా పరవాలెదని, ప్రజలంతా సంసారం నుండి విముక్తి చెందాలని తపించిన మహాను భావుడు.

అంటరానివారనేవారిని ఆలయ ప్రవేశం చేయించారు.

రామానుజుల గురువుల్లో ఒకరు " తిరుక్కచ్చి నంబి ' మరొకరు " పెరియ నంబి ' ..ఈ ఇద్దరు కూడా శూద్ర కులం లో పుట్టిన వారే.

ఆలయ నిర్వహణ లో శూద్రులను భాగస్వాములుగా చేశారు.

స్నానానికి వెళ్ళేముందు బ్రాహ్మణ శిష్యుల భుజాలపై చెతులు వేసి వెళ్ళేవారు..స్నానం ముగించుకుని చర్మకారులైన శిష్యుల భుజాల పైన చేతులు వేసి నడిచివచ్చేవారు. స్నానం .. పై శరీరాన్ని శుభ్రం చేస్తే, 'సమరసత ' లోపలి అహంకారాన్ని తొలగించివేస్తుందంటూ రామానుజులు జవాబిస్తారు.

11 వ శతాబ్దం లో ' తిరుప్పాణాళ్వార్ ' అనే శూద్రుల చేతుల్లో దేవాలయ వ్యవస్థను అప్పగించిన అపురూప సమరసతా వేత్త రామానుజాచర్యులు జన్మించి ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడిచింది.. వారి అడుగుజాడల్లో మరో సమరసతా విప్లవానికి నాంది పలుకుదాము...
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమరసతలో ఎంతో ఎత్తుకు ఎదిగిన రామానుజుడు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers