సమరసతా సంస్కర్తలు ...1. బసవణ్ణ,2.తిరుప్పాణి అళ్వార్
అ) తిరుప్పాణి ఆళ్వార్ అనే నిమ్న వర్గపు భక్తుడిలో కొలువున్న భగవాన్ విష్ణువు.
సారంగముని అను అర్చకుడు తన భుజాలపై తిరుప్పాణిని మోసుకొచ్చాడు.
శ్రీ రంగం పట్టణం (తమిళ నాడు) లోని తిరుప్పాణి అనే భక్తుడు భక్తి గీతాలు పాడుతుంటే సారంగ ముని రాళ్ళతో కొట్టించి, గర్భగుడి లోకి వెళ్తే విగ్రహం నుండి రక్తం కారుతుంది. బ్రాహ్మణ అభిజత్యం తో తాను ఎంత తప్పిదం చేశాడో తెలుసుకున్నాడు .సిద్ధపురుషుడయ్యాడు.తిరుప్పాణి ఎన్నో భక్తి గీతాలు వ్రాసి అన్ని కులాలకు ఆరాధ్యుదయ్యాడు.
ఆ) బసవణ్ణ ను మించిన సమరసతవాది ఎవరు?
అనుభవ మండపం( ఇప్పటి శాసనసభల మాదిరి) లో అక్కమహాదేవి,లావణ్య వతి,నాగాంబిక వంటి స్త్రీలకు, అలాగే అన్ని కులాలకు స్థానం కల్పించాడు.
800 వేల ఏళ్ళక్రితమే 1131 లో బ్రాహ్మణ కులం లో పుట్టి, కులం కుళ్ళును దులిపిన మహానుభావుడు.
కప్పలను అమ్ముకునే కులం లో పుట్టింది మండోదరి.కిరాతకుని పుత్రుడు అగస్త్యుడు.కౌండిన్యుడిది మంగలి కులం,కశ్యపుడిది కుమ్మరి కులం ....వీళ్ళందరు కులం తో కాదు జ్ఞానం లో ఉద్ధండులై ఆదర్శంగా నిలిచారని ప్రవచిస్తాడు బసవణ్ణ.
12 వ శతాబ్దం లోనె సమాజం లో విప్లవాన్ని తెచ్చాడు.వీర శైవం గా తీర్చిదిద్ది, నిమ్న వర్గాల కులాలవారినందరిని శిష్యులుగా చేర్చుకున్నాడు.
- అప్పాల ప్రసాద్.
సమరసతా సంస్కర్తలు
ReplyDelete