Thursday, June 2, 2016

నందనార్ మరియు మాల దాసర్ల వల్ల ఈ భూమి లో సమరసత వెల్లి విరిసింది

నందనార్ మరియు మాల దాసర్ల వల్ల ఈ భూమి లో సమరసత వెల్లి విరిసింది.

అ) బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసుడయ్యాడు.మాల దాసరి అతనిని విముక్తున్ని చేశాడు.

సామాజిక సమరసతా వాది మాల దాసరి రోజూ అడవి గుండా నడచి, విష్నుమూర్తిని దర్శించి,'మంగల కైశకి రాగం తో అర్చన చేసేవాడు.

ఆ విధంగ గొప్ప పుణ్యం సంపాదించాడు.ఒక రోజు బ్రహ్మ రాక్షసి ఎదురై మ్రింగ బోతాడు. దేవుణ్ణి అర్చించి వస్తానని మాటిచ్చి, రాగాలాపన చేసి వస్తాడు..మ్రింగ మంటాడు.బ్రహ్మ రాక్షసి తనకు ఆ పుణ్య ఫలాన్ని ధారపోయమంటాడు.తాను పొందిన పుణ్యాన్ని ఇవ్వగానే బ్రహ్మరాక్షసి శాపం తొలగి,బ్రాహ్మణుడై మాల దాసరి కాళ్ళు మొక్కుతాడు.

ఈ సంఘటన గాథ శ్రిక్రిష్ణ దేవరాయలు వ్రాసిన 'అముక్తమాల్యద ' లో వుంది.

ఈ మాల దాసర్లే వూరూరా హరి సంకీర్తన చేస్తూ సామాజిక సమరసతను, భక్తిని ప్రచారం చేసేవారు..ఇప్పటికీ అక్కడక్కడా వైష్ణవ భక్తులై సంచరించే వీరిని ఆదరిద్దాం.మనమూ వారి మార్గం లో నడుద్దాం.

ఆ) నందనార్ 5 వ శతాబ్దానికి చెందిన 63 శైవ ఆళ్వార్లలో నిమ్న వర్గం లోని ఒక భక్తుడు. తిరుక్కుంగూరు దేవాలయం లోనికి కులం పేరుతో లోపలికి రానివ్వలేదు. బయటి ద్వారం నుండి చూస్తుంటే నంది విగ్రహం అడ్డుగా వుంటుంది.వెంటనే దర్శనమివ్వరా అని భక్తితో వేడుకుంటాడు.నంది విగ్రహం పక్కకు జరుగుతుంది.శివుడు దర్శనమిస్తాడు.ఇప్పటికీ ఆ నంది విగ్రహం పక్కకు జరిగే వుంటుంది.

త్రాగుబోతులు, కులచాదస్తులు,అసూయా పరులు, జంతుబలులనిచ్చే వారిలో మార్పు తేవటం కోసం కృషి చేస్తాడు.

పరమాత్మ పంచభూతాలను తయారు చేశాడు.వాటితోనే మానవులు రూపొందారు.ఇక ఈ భేదాలెందుకు? అని ప్రశ్నిస్తాడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. నందనార్ మరియు మాల దాసర్ల వల్ల ఈ భూమి లో సమరసత వెల్లి విరిసింది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers