Thursday, June 2, 2016

చండాలుడే నాకు గురువన్న సమరసతా వాది


దడి కట్టుకుని నన్ను ముట్టబోకు అనే అమానుష పద్దతి ని చీల్చి చెండాడిన ఆది శంకరుడు.

దారికడ్డు వచ్చిన నిమ్నవర్గపు వ్యక్తిపట్ల తన శిష్యులు చేసిన తప్పిదాన్ని గ్రహించి అన్ని జీవుల్లో భగవంతున్నడని ..మనీషా పంచకం ' రచించాడు. చండాలుడు ఎదురై ...అందరిలో వున్నది ఒకే ఆత్మ కదా....అలాగే అందరి శరీరాలు అన్నం వల్లనే కద ఏర్పడుతున్నాయి...మరి మీరు పక్కకు జరగమంటున్నది ఎవరిని? ఆత్మనా/ శరీరాన్నా? అని ప్రశ్నించి ప్రపంచ ప్రజల కళ్ళు తెరిపించాడు.ఆది శంకరుడు ఆతనికి హృదయపూర్వకంగా నమస్కరించాడు.

దుష్ట సంప్రదాయాలను నాశనం చేశాడు..ఆత్మ కు కుల , వర్గ,లింగ ,వర్ణ, జాతి వివక్షత లేదని అద్వైతాన్ని భారత్ నలువైపులా స్థాపించాడు.

కాలడి (కేరళ) నుండి బయలుదేరి హిమలయాలవరకు సాగిన ఆయన యాత్ర, గురూపదేశం తో జ్ఞానం పొంధి , దేశం నలు చెరుగులా నాలుగు పీఠాలు స్థాపించి ధర్మ రక్షణకు నడుం బిగించారు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. చండాలుడే నాకు గురువన్న సమరసతా వాది

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers