Friday, September 25, 2015

మనని హిందువులని పిలిచింది శత్రువులు కాదు



మనని హిందువులని పిలిచింది శత్రువులు కాదు.ఏయే దేశాల్లో మనవాళ్ళు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రభావితం చేస్తున్నారో ఆ ఇరాన్ లో వున్న పార్శీలు మనని హిందువులు గా భావించారు..పిలిచారు.గమ్మత్తేమిటంటే ఆ పార్శీలకు ఈ రోజు వాళ్ళకంటూ భూమి లేదు.వాళ్ళలో చాలామంది మన దేశం లో జీవిస్తున్నారు.అయినా మీ పేరు మీరు పెట్టుకున్నారా? మీ పేర్లు ఇతరులు పెట్టిందే కదా? మేము ఫలాన వారం అని చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు.ప్రపంచమంతా మానవులే అని భావించిన ధర్మం మనది. మనమెవరమో మనని పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మనం సనాతన ధర్మీయులమని , భారతీయులమని ,హిందువులమని మనం ఎందుకు చెప్పుకోలేదు? అది అంత ముఖ్యమని మనమనుకోలేదు.వాళ్ళు పిలిస్తే అది తప్పుగా భావించలేదు..ఈ రోజున ఆ పేరే మన ప్రతిష్టను,వైభవాన్ని తెచ్చిపెడుతుందని కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే అర్థం కావటం లేదా? మన పనుల ద్వారా , విశ్వాసం ద్వారా ప్రపంచాన్ని ప్రభవితం చేస్తే చాలు ఇతరులు పెట్టినట్లుగా భావించే హిందు శబ్ధానికి కూడా బంగారు వన్నె తెచ్చిపెట్టగలము.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. మనని హిందువులని పిలిచింది శత్రువులు కాదు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers