యోగ దినోత్సవాన్ని ప్రతిపాదించింది భారత్ కి చెందిన ప్రధాని మోడి యని, ఆయన వెనక ఆర్ ఎస్ ఎస్ వుందని, అది హిందుత్వం ఆధారంగా పనిచేస్తుందని ప్రపంచ దేశాలకు తెలియదా? తెలిసినప్పటికీ "యోగ" మానవులందరికీ సుఖాన్ని ఇస్తుందని శాస్త్రీయంగా గుర్తించాయి.యోగ ని ప్రపంచంలో ప్రచారం చేసిన మనవారిని హిందువులు అనాలా ? సనాతనీయులు అనాలా? భారతీయులు అనాలా? అని ఇప్పటి సమయం లో చర్చించటం సరియైనది కాదు.మనం చేస్తున్న పనులు,మనం ప్రపంచ మానవాళి కోసం ప్రతిపాదిస్తున్న అంశాలు ముఖ్యమైనవా కాదా? అని మాత్రమే ఆలోచించాలి.ప్రపంచమంతా మన దేశాన్ని సానుకూల దృష్టితో చూస్తున్న ఈ సమయం లో హిందుత్వమే సరియైన సిద్ధాంత బలమని గుర్తించాలి.
- అప్పాల ప్రసాద్.
యోగ దినోత్సవాన్ని ప్రతిపాదించింది భారత్