Friday, September 25, 2015

హిందు పదం గురించి ఈ సమయం లో చర్చించవలసిన అవసరం లేదు


హిందు పదం గురించి ఈ సమయం లో చర్చించవలసిన అవసరం లేదు. ఈ రోజు ప్రపంచంలో హిందు పదానికి విశేష ప్రాధాన్యత లభించింది.హిందూ శబ్దాన్ని ప్రారంభం లో వ్యతిరేకించిన ఆర్య సమాజీయులు కూడా హిందువులుగానే భావిస్తున్నారు.కొన్ని దేశాల్లో బౌద్ధులు సైతం తాము హిందు ధర్మానికి చెందినవాళ్ళమని చెప్పుకుంటున్నారు. హిందు పదం విదేశేయులు పెట్టిన పేరు కాదు. విదేశీయులు మన ప్రజలకు హిందు అని పేరు పెట్టవలసిన అవసరమేముంది? ఆలోచించవలసిన అవసరం వుంది. ప్రపంచంలోనే భౌతికంగా, ఆధ్యాత్మికంగా వైభవాన్ని సాధించిన మనకు విదేశీయులు పెరు పెట్టవలసిన అవసరమేముంది? కేవలం భారతీయులు లేదా సనాతీయులు అని పెట్టుకుని హిందు పదం తొలగించినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏముంది?ప్రపంచం లోనే ఇస్లాం,క్రిస్టీయన్ మతాలు లేనప్పుడు మన పూర్వీకులు ప్రపంచమంతా ప్రజలకు ఉత్తమమైన ఆదర్శాలు నేర్పించడానికి,శ్రేష్టులుగా మలచడానికి వెళ్ళినప్పుడు,మనం నిజమైన మానవాతావాదులుగానే గుర్తించారు.అయితే ప్రతివారు తన కన్నతల్లి,తన జన్మభూమి ఆధారంగానే విశ్వధర్మాన్ని,వసుధైక కుటుంబాన్ని చాటగలరు.కాళ్ళు పెట్టుకోవడానికి సిందూ పరివాహక నేల లేక పోతే సనాతనం,భారతీయత శబ్ధాలకు కూడా గొప్పతనమెముంటుంది? సిందూ పరివాహక ప్రాంతం నుండి వచ్చిన మన వారిని హిందువులుగా పిలిచివుంటారు..అందులో తప్పేమి లేదు.మరికొందరు హిందూ అనకుండా మానవతా వాదులం అని పేరు పెట్టుకుంటే బాగుండేది కాదా? అని అంటారు. కాబట్టి ఇవన్నీ అనవసర చర్చలు. హిందు అనే పదం మతం కాదు.మానవతా ధర్మం.మొన్న మొన్న పుట్టిన క్రైస్తవ , ఇస్లాం మతాలు అలాగే వాటి గ్రంథాల పుట్టిన తేదీల గురించి అలోచిస్తూ.వేల సంవత్సరాల మన ధర్మం యొక్క కాల నిర్ణయాల గురించి అడగటం అజ్ఞానం తప్ప మరోటి కాదు. వేదాల కాలం గురించి ఇంత గాభరా పడవలసిన అవసరమా? హిందుత్వం విషయం లో శత్రువులు పన్నుతున్న కుట్రలో భాగంగా ఇటువంటి చర్చలు,ఆరోపణలు,వ్యాసాలు,లేఖలు,మీడియా వార్తలతో నిన్నూ నన్నూ ప్రపంచాన్నే తికమక పెట్టగలరు.అందులో కమ్యూనిష్టులు గ్లోబల్(అబద్దాల) ప్రచారం లో ప్రసిద్దులు. హిందూ పదం ఈ కాలం లో శ్రేష్టమైనది.దృఢమైన విశ్వాసంతో వుంటే ప్రపంచం సాదరంగా వినమ్రతతో మోకరిల్లుతుంది.అందుకు ఉదాహరణ..జూన్ 21 అంతర్జతీయ యోగ దినోత్సవాన్ని 175 దేశాలు ఎలా అంగేకరించాయి.ప్రతిపాదించిన మన దేశం హిందూ దేశమని వాటికి తెలియదా? అందులో ఇస్లాం,బౌద్ధ,క్రిస్టియన్ దేశాలు లేవా? అనవసరంగా హిందూ అనే శబ్ధం గురించి కాలయాపన చేయకుండా మానవత్వాన్ని గురించి ఆలోచించే హిందుత్వం మన ఊపిరి గా దేశం గురించి పనిచేయాలి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందు పదం గురించి ఈ సమయం లో చర్చించవలసిన అవసరం లేదు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers