Wednesday, February 4, 2015

ఈ వూర్లో అంటరానితనం లెదు


ఈ వూర్లో అంటరానితనం లెదు.ఒక వర్గం పిలవలేదు. ఇంకో వర్గం రాలేదు..ఎవరికి వారే యమునా తీరే. .ఐతే ఎస్ సి వర్గాల ప్రజలు ఎన్నడూ హనుమాన్ మందిరంలోకి ప్రవేశించలేదు. కాని ఈ సారి అందరు కలిసి దేవాలయ ప్రవేశం చేస్తూ హిందూ సమాజం లోని భేదభావాన్ని తొలిగించివేసిన ఘనత కోనాపూర్ ప్రజలకు దక్కుతుంది.

కోనాపూర్ గ్రామం..రామాయంపేట గ్రామానికి 3 కిలోమీటర్ దూరంలో వుంది..ఆ గ్రామంలో జనవరి 16 న ఉదయం 9 గంటలకు అన్ని కులాల ప్రజలు ఎస్ సి వాడల్లో నడుస్తూ కులాలు వేరైనా మనమంతా హిందువులమే అంటూ అంటరానితనం లేని గ్రామంగా వుండాలని చాటి చెప్పారు..సామాజిక సమరసతా వేదిక మండల కన్వీనర్ కిష్టయ్యగారి లక్ష్మా రెడ్డి మరియు ఇతర అన్ని కులాల పెద్దలు అలాగే వివేకానంద యువజన సంఘం సభ్యులు సద్భావనా వాతావరణానికి శ్రీకారం చుట్టారు.గత సంవత్సరం 55 మంది,ఈ సారి జనవరి 26 న 48 మంది యువకులు రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటి చెప్పారు.శ్రీ కమలానంద భారతి స్వామిజీ జనవరి 16 న కోనాపుర్ లో అడుగుపెట్టి వీధుల్లో నడుస్తుంటే భక్తి భావం,హిందూ ఐక్యతా రాగం తొణికిసలాడింది.

ఈ వూర్లో అంటరానితనం లెదు..ఐతే ఎస్ సి వర్గాల ప్రజలు ఎన్నడూ హనుమాన్ మందిరంలోకి ప్రవేశించలేదు. కాని ఈ సారి అందరు కలిసి దేవాలయ ప్రవేశం చేస్తూ హిందూ సమాజం లోని భేదభావాన్ని తొలిగించివేసిన ఘనత కోనాపూర్ ప్రజలకు దక్కుతుంది.

దుర్గమ్మ దేవాలయ ఆవరణలొ అందరూ కూర్చుని స్వామిజి సందేశం శ్రద్ధగా విన్నారు..భక్తితో భజన చేసారు.

1 comment:

  1. ఈ వూర్లో అంటరానితనం లెదు

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers