ఇది నార్లాపూర్ గ్రామం. రామాయం పేటకు 15 కిలోమీటరుల దూరం..అందరు కలిసి జీవించే పల్లె ఇది. ఈ గ్రామం లోని యువకులు 20 మంది కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు..అందులో 800 మంది పాల్గొన్నారు.15 మందికి కంటి ఆపరేషన్లు చేయించారు. ఆ వూర్లో వయసు మళ్ళిన వృద్ధ దంపతులు బిచ్చమెత్తుతుంటే ఆపేయించి, యువకులు తమకు తాము డబ్బులు జమ చేసుకుని వార వారం కూరగాయలు ఇస్తారు..ఉచితంగా వైద్యం అందిస్తారు.బట్టలు ఇస్తారు. 15 మంది గ్రామం కోసం పనిచేసిన వివిధ వృత్తుల వారికి సన్మానం చేసారు.ఆడపిల్లల కోసం ముగ్గుల పోటీలు పెట్టారు.పేద పిల్లల కొసం ఉచితంగా బ్యాగులు ఇప్పించారు.
ఇదంతా ఒకటైతే మరో వైపు..
సుమారు 400 ఇళ్ళు వుంటాయి. ప్రతి ఇంటి నుండి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.సమరసతా భావాన్ని వ్యక్తపరిచారు. స్వామిజి కమలానంద భారతి వీధుల్లో నడిచి మనలో కుల భేదాలు వద్దని చెపుతుంటే ప్రజలు వారిని అనుసరించారు..వీధుల్లో నీళ్ళు చల్లి,వారికి స్వాగతం పలికారు..చిన్న పెద్ద గుళ్ళన్నిటికీ తీసుకునిపోయారు.ముఖ్యంగా ఎస్ సి బస్తీ ప్రజల ఆనందానికి అంతే లేదు..వారి ఇళ్ళలో ప్రవేశించి ఎల్లమ్మ,పోచమ్మ వంటి గ్రామ దేవతలకు పూజ చేస్తుంటే వారంతా పులకరించిపోయారు.దేవాలయ ప్రాంగణం లో వారి సందెశం శ్రద్ధతో విన్నారు.
ఇది నార్లాపూర్ గ్రామం. రామాయం పేటకు 15 కిలోమీటరుల దూరం
ReplyDeleteYou are sharing very good & positive news. Keep it up!
ReplyDeleteBhaskar