Friday, September 25, 2015

హిందు శబ్దం వింటేనే కలవరమెందుకు?


హిందు శబ్దం వింటేనే కలవరమెందుకు? అందరినీ కలుపు కుని ,అందరినీ గౌరవించే ధర్మం కాబట్టే. కమ్యూనిష్టులకు కంపరమెత్తుతుంది. కమ్యూనిజం ప్రపంచములో అత్యంత దీనావస్థలో వున్నది. దాని ఏకైక ఎజండా హిందువులను వ్యతిరేకించటమే..కమ్యునిష్టుల ఉచ్చులో పడకుండా దళితులను కాపాడిన మహానుభావుడు డాక్టరు భీమరావ్ అంబేడ్కర్. అటువంటి గొప్ప నాయకుడు ఈనాడు లేకపోవటం బాధాకరం. కొందరు ప్రభుత్వానికి,మరికొందరు రాజకీయ నాయకులకు,ఇంకొందరు క్రైస్తవ ధనానికి, ఒవైసీ మతోన్మాదులకు తొత్తులై,ఇంకా కొందరు కమ్యూనిష్టుల భావజాలానికి బానిసలై , దళితులకు నాయకత్వం వహిస్తూ దళితుల మనోభావాలు తెలుసుకోకుండా మోసం చేస్తున్నారు. డాక్టరు భీమరావు అంబేడ్కర్ అప్పటి హిందూ సమాజంలోని వికృత చర్యలకు నొచ్చుకొని బౌద్ధంలో చేరాడే కాని కమ్యునిష్టులను మాత్రం నమ్మలేదు. బౌద్ధం దేశానికి ప్రయోజనం.కమ్యునిజంలొ చేరి వుంటే దళితుల పరిస్థితి ఘోరంగా వుండేదీ. అంతేకాదు ఇస్లాంలో చేరితే...(పాకిస్తాన్ లోపల 13 లక్షల దళితుల ఊచకోత జరిగింది. ) చెప్పకపోతేనే మంచిది. పేరు,భాషా,వేషం,కులదేవతా ఆరాధన అన్నీ మారిపోయి వుండేది. క్రైస్తవం లోపలి కి మారి వుంటే ఇతరులను నమ్మని భయం భయం తో కాలం గడిపేవారు. ఏమని చెప్పుకోవాలో అగమ్య పరిస్థితి వుండేది. డా భీమ్రావ్ అంబేడ్కర్ ఆ సందేహాలు తొలగించాడు. ఆయన అణగారిన వర్గాలను తలెత్తుకునేట్లు చేసిన ఉత్తమ దేశ భక్తుడు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందు శబ్దం వింటేనే కలవరమెందుకు?

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers