Saturday, May 28, 2016

రామాయణం లో సమరసత


* బోయ కులం లో జన్మించిన రత్నాకరుడు నారదుని వరప్రసాదం తో 'శ్రీ రాముని కథ ' ను ప్రపంచానికి అందించాడు.నూటికి 99 శాతం ముస్లిములు వుండే ఇండోనేషియా లో ఇప్పటికీ రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు.

* బ్రాహ్మణ కులం లో పుట్టిన రావణుడు ఒక స్త్రీ పట్ల వ్యవహరించిన ధొరణికి, శ్రీ రాముడు అతన్ని వధిస్తాడు.(ఇతిహాసం తెలియని కొందరు రావణుడు దళితుడని,తాము రావణుని వారసులమని చెప్తున్నారు.దేశాన్ని ఉత్తర,దక్షిణాలుగా,ఆర్యులు, ద్రావిడులుగా విభజించడానికి ఆంగ్లేయులు పన్నిన కుట్ర కు బలైన దారి తప్పిన సోదరులుగా మిగిలిపోతున్నారు)

* వశిష్టుడు బ్రహ్మణుడైనా మాదిగ కులం లో జన్మించిన అరుంధతి ని వివాహ మాడుతాడు.అప్పటికే ఆమె వేద విజ్ఞానం లో అనుభవం గడించింది.అంతే కాదు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు తమ గురుకులం లో వుంచి, అరుంధతి తాను చేసిన వంట తో వారికి తినిపిస్తుంది.అంతేనా? సీత రాముని తో అడవికి వెల్తుంటే, దండ కారణ్యం లో ఎలా మసలు కోవాలో అరుంధతి చెప్తుంది.(వశిష్టున్ని దుర్మార్గుడిగ, శ్రిరాముడిని శంభుకున్ని వధించిన హంతకునిగా,వాల్మీకి రామాయణం లో లేనిది చిత్రీకరించే ప్రయత్నం కొందరు చేయటం చూస్తున్నం).ఇంతెందుకు?ఈ వశిష్టుడు, ఊర్వశి అను వేశ్యకు పుత్రుడిగా జన్మించాడని ఎందరికి తెలుసు?

* 90 ఏళ్ళ ముదుసలి గిరిజన యువతి శబరి ఆశ్రమం వెళ్ళి, ఆమెను చక్రవర్తి శ్రిరాముడు ఎంగిలి రేగు పండ్లు తింటూ పరామర్శించడంటే, కులం కాదు భక్తి, జ్ఞానాలకు ప్రాధాన్యత నిచ్చిన సంస్కృతి యని నిరూపించాడు.

* వన రాజైన గుహుడిని స్నేహితుడిగా కౌగిలించుకున్న రాముని సమరసత అందరూ ఆచరించ తగ్గది కాదా?

* వనచరులైన జాంబవంతుడు,హనుమ,సుగ్రీవులను ఆదరించిన తీరు గౌరవించిన సంఘటనలు భారతీయుల్లోని ఔదార్యానికి ఉదాహరణలు కాదా?

* లంకను గెలిచినప్పటికినీ తాను ఆక్రమించక, లక్ష్మనుడి ఆకర్శణను వద్దని, తమ్ముడు విభీషణునికి అప్పగించిన ఘటన ప్రపంచ రాజులకే ఆదర్శం కాదా? తమ్ముడి భార్యను ఎత్తుకొచ్చిన వాలిని వధించి, ఆతని కొడుకు ను యువరాజుగా నియమించటం సామాన్యమైన విషయం కాదు. రావణుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు శ్రద్ధతో చేయాలని విభీషణున్ని ఒప్పించింది శ్రీ రాముడు కాదా?

ఈ కథలో బ్రాహ్మణ కులాధిపత్యం, అంటరానితనం ఎక్కడుంది? శంభూకున్ని,రావణున్ని ఉదహరించే వారు మొత్తానికి రామాయణం వాస్తవంగా జరిగిందని, కల్పిత కథ కాదని ఒప్పుకుంటున్నారు.

* గమ్మత్తేమిటంటే మహబూబ్ నగర్ జిల్లాలో బాలాపూర్ గ్రామం లో ఏటా శ్రి రామ కల్యాణం జరుగుతుంది.సీతమ్మ వారు ఎస్ సి ల ఆడపడుచుగా, శ్రి రాముడు ఇతర కులాల వరుడిగా ఊరేగింపు గా తెచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు.

రాముని కాలం లో లేని వివక్షత ఇప్పుడెందుకుందో లోతుగా ఆలోచించాలి.అంటరానితనమనే మానసిక రోగాన్ని, రామాయణ కథలు చెప్పి తొలగించే ప్రయత్నం చేయాలి. గొంగట్లో గొంగలిపురుగులను ఏరాలనుకునే వారికి,ప్రతి దాంట్లొ తప్పులు వెతికెవారికి ఎమి చెప్పినా దండగే కదా?
- అప్పాల ప్రసాద్

1 comment:

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers