Saturday, May 28, 2016

వేదాలు, ఉపనిషత్తుల నిండా సమరసతనే


యజుర్వేదములోని 26 వ అధ్యాయం లోని 2 వ మంత్రం ఇలా చెప్తుంది. ' మానవులందరి కొరకు ఇహ పర సుఖాలను ఇచ్చే నాలుగు వేదాల సందేశాన్ని నేను చెప్తున్నట్లే మీరు కూడా అందరికీ చెప్పాలి ' .

స్వామి దయానంద సరస్వతి కృషి కారణంగా పంచమ వర్ణం అనుకునే వారికి కూడా వేదాధికారం,యజ్ఞాధికారం వుందని అందరికీ తెలిసింది.

వేదం చెప్పిన ఓం నమశ్శివాయ , ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను గురువులు అన్ని కులాల వారికి బొధించారు.

యజ్ఞోపవీతాన్ని అందరూ ధరించవచ్చని,అచరణాత్మకంగా చూపించిన దయానందుడు, వివేకానందుడు అందరికీ ఆదర్శం.

చాందొగ్యోపనిషత్తు లో వేశ్యా పుత్రుడైన సత్య కామ జాబాలి కి వేద విద్యను గ్రహిస్తాడు..అదే ఉపనిషత్తులో 'జనశృతి ' అనే శూద్రుడు రైక్వుడనే ఋషి నుండి వేద విజ్ఞానాన్ని పొందుతాడు.పుట్టుక తో కాదు గుణం వల్ల ఏర్పడుతుందని ఉపనిషత్తులు చెప్పాయి.

సత్యం, దానం,ఓర్పు, శీలం,అహింస , తపస్సు, దయ గల వారందరూ ఎవరికి పుట్టినా వారంతా బ్రాహ్మణులే నని ధర్మరాజు , సర్పరాజైన నహషుడికి చెప్తాడు.

క్షత్రియుడిగా పుట్టి, విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడు.

చండాలుడైనా మాతంగుడు ఋషి అయి,శబరి ని చేరదీసి, రాముడికి దగ్గర చేశాడు.

ఇలా ఎన్నో ఉదాహరణలు ఇతిహాసాల్లొ కనిపిస్తాయి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. వేదాలు, ఉపనిషత్తుల నిండా సమరసతనే

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers