Saturday, May 28, 2016

మహా భారతం లో సమరసత


* మహాభారతం ఒక ధర్మ శాస్త్రం.వ్యాసుని ద్వారా ఒక దాసి కి జన్మించిన విదురుడు చెప్పిన నీతులు మానవాళి కి అనుసరణీయం.శ్రికృష్ణుడు మొదలుకుని అందరూ విదురుణ్ణి గౌరవిస్తారు.ఇక్కడ * బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కడుంది.

* శ్రిక్రిష్ణుడు ధనిక కుటుంబం లో పుట్టినా కూడా గర్వపడక, పేదవాడైన కుచేలుడిని ఆదరించి, సన్మానించిన తీరు మన హిందూ సంస్కృతి ఔదార్యాన్ని తెలుపుతుంది.

* మాలలు కుచ్చి అమ్ముకునే మాల కన్య కుబ్జ అను కురూపి యువతిని స్పర్శించి,తన సమరసతను చాటి చెప్తాడు.

* కురుక్షెత్ర యుద్ధం ముగిసిన తరువాత ఉదంకుడు అనే ఋషి తనకు నీటి ని అందించమని అడిగినప్పుడు,కృష్ణుడు ఒక చండాలుడి రూపం లో వస్తాడు.వికృత శరీరం నుండి కారుతున్న నీటిని త్రాగమంటాడు.అప్పుడు ఉదంకుడు ఆగ్రహిస్తాడు.ఆ చండాలుడు మాయమయి కృష్ణుడై ఇల అంటాడు. ' అమృతాన్ని కారుస్తూ తీసుకొస్తే అహంకారం తో అవకాశం వదలుకున్నావని 'ఆ ఋషి గర్వాణ్ణి అణచివేస్తాడు కృష్ణుడు.

* ఏకలవ్యుడికి విద్య నేర్పించక పోతే,ఆ ద్రోణుణ్ణే గురువుగా స్వీకరిస్తాడు.అర్జునుణ్ణి మించిపోతాడు.గురువు అడిగితే బొటన వ్రేలును కూడా కోయడానికి సిద్ధపడతాడు. ప్రత్యక్షంగా విద్య నేర్చుకున్న దుర్యోధనుడు మాత్రం ద్రోణుణ్ణి అడుగడుగునా అవమానిస్తాడు.గురుభక్తిలో వనచరుడైనా ఏకలవ్యుణ్ణి మించిన వారు లేరు.

* కౌశికుడనే ముని శ్రేష్టుడి కి ధర్మ బోధ చేసింది పశు మాంసం అమ్ముకుని జీవించే ధర్మవ్యాధుడని..ఈ కథ మహాభారతం లో చదవొచ్చును.వృత్తి ధర్మం చేసే వారైనా జ్ఞానం లో వారిని మించిన వారు లేరు.వేదాలు చదివినా, విన్నా చెవుల్లో సేసం పోసేది హిందూ మతమని ఆడిపొసుకునే వారికి అరుంధతి,ధర్మవ్యాధుడు వేద విజ్ఞానం ఎలా నేర్చుకున్నారో అర్థం చేసుకోవాలి.

* పాదాల నుండి శూద్రులు జన్మించారని కొందరు వ్యాఖ్యానిస్తారు. తల,చేతులు,తొడలు,పాదాల నుండి పుట్టడం ఏమిటి? తల బుద్ధికి,చేతులు సాహసానికి,తొడలు కూర్చుని వ్యాపారం చేయడానికి, పాడాలు నిరంతరం సేవ చేయాడానికి గుర్తుగా చెప్పారు..అయినా కూడా పాదాలకు మొక్కుతారు కాని,తలకు,తొడలకు ఎవరైనా మొక్కుతారా చెప్పండి?అంటే శూద్రులకు నమస్కరించాలని అర్థం చెప్పుకోవచ్చా?

* అందుకే గుణాన్ని బట్టి వర్ణాలు ఏర్పాటు చేశారు.అది కూడా ఈ కాలానికి అసలే వర్తించదు.ఆ తరువాత చేతి వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి..జన్మతహ కాదు...పని విభజన జరిగింది ...కాని దురదృష్టమేమిటంటే మనం మాత్రం పని విభజన కాకుండా..పని చేసే వారిని విభజించాం..గతం లో లేని కుల వివక్షత మన సమాజం లోకి వచ్చేసింది.ఇది తొలగించే బాధ్యత మనదే కదా?
- అప్పాల ప్రసాద్.

1 comment:

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers