Tuesday, March 1, 2016

దేశవిభజన జరిగిన కాలానికి,ఇప్పటికీ తేడా లేదు

దేశవిభజన జరిగిన కాలానికి,ఇప్పటికీ తేడా లేదు.
అవే శక్తులు పడగ విప్పి నృత్యం చేస్తున్నాయి..

దేశం లో సివిల్ వార్ నడుస్తున్నది. దేశ భక్తులపై సవాల్ విసురుతున్నది.

ఇది రెండు రాజకీయ పక్షాల మధ్య, రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. రెండు దేశాల మధ్య (పాకిస్తాన్, భారత్ ల మధ్య ) ప్రత్యక్ష, పరోక్ష సివిల్ వార్ ఇది.బిజెపి నచ్చకపోతేనో,ఎబివిపి నచ్చకపోతేనో రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపే స్వేచ్చ వుందిక్కడ.కాని దేశాన్ని ముక్కలు చేద్దామని చూసే పాకిస్తాన్ కుట్రలకు, ఉగ్రవాద,తీవ్రవాదుల చర్యలకు ప్రతిపక్షాలు,ముఖ్యంగా కాంగ్రెస్,కమ్యూనిస్టులు మద్దతిస్తున్న తీరు చూసి కులం,మతాల కతీతంగ దేశప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది.మతాల మధ్య ,కులాల మధ్య,దేశాల మధ్య చిచ్చు రేపుతున్న ఈ ధోరణులను అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి.

డా.అంబేద్కర్ రాజ్యాంగ తొలి పీఠికలో ప్రవచించిన సర్వసత్తాక,ప్రజాస్వామ్య,గణతంత్ర దేశాన్ని ముక్కలు చేసే ఎటువంటి ప్రయతాన్నైనా గట్టిగా నిరసించాలి..గత 40,50 సంవత్సరాలుగా దేశ విద్రోహ శక్తులు అన్ని రంగాల్లో చొరబడి తిష్ట వేసుకున్నాయి. వోట్ బ్యాంక్ పేరుతో, దళిత కార్డ్ పేరుతో,సెక్యులరిజం పేరుతో..మైనారిటీ ల పేరుతో....ఇలా వివిధ వేషాలు వేసుకుని పత్రికల్లో,రాజకీయ పార్టిల్లో,ప్రభుత్వాల్లో,విశ్వవిద్యాలయాల్లో,ఈ దెశ ద్రోహులు నానా రభస చేస్తున్న సంగతి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నది..ప్రధాని మోడి వీళ్ళ మితిమీరిన దేశ వ్యతిరేక స్వేచ్చ(భావ వ్యక్తీకరణ స్వేచ్చ) కు పగ్గలు వేయటం భరించలేక కాల నాగుల వలె పొగలు సెగలు కక్కుతున్నారు.

ఇంగ్లీష్ దినపత్రిక 'ద హిందు ' , తెలుగు పత్రిక ' ఆంధ్రజ్యొతి ' టివి 9, ఏన్ డిటివి, ఆజ్ తక్ వంటి న్యూస్ చానల్స్ పత్రికలు దేశద్రోహులకు వంతపాడేవారికి అండగా నిలిచి విషాన్ని చిమ్ముతున్నాయి..మన తెలంగాణాలో వర వర రావ్,కంచ ఐలయ్య,కాకి మాధవ రావ్, ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీనివాస్,తెలకపల్లి రవి,బొజ్జ తారకం, డా హర గోపాల్ వంటి మేధావులు కులాల మధ్య, మతాల మధ్య మంట రేపే పని లో వున్నారు..కంచ ఐలయ్యకు క్రైస్తవ మిషనరీలనుండి కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయని లోకం కోడై కూస్తున్నది..దళిత కార్డ్ పేరుతో(దళిత ముసుగు లో) కొందరు మతం మారిన క్రైస్తవ విద్యార్హి నాయకులు,క్రైస్తవ రాజకీయ నాయకులు అమాయక విద్యార్థుల్లో,ప్రజల్లో విద్వేషాలు నింపుతున్నారు.దీనికి తోడు బెంగాల్ నుండి, కేరళ నుండి వచ్చిన జిహాదీ విద్యార్థులు దేశ ద్రోహులైన అఫ్జల్ గురు,యాకూబ్ మేమెన్,మక్భూల్ భట్ వంటి వారిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారంటే పరిస్థితులు ఎంత తారా స్థాయికి వెళ్ళాయో ఊహించండి. సియాచిన్ లో మరణించిన హనుమంతప్ప నుండి గతంలో బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసిన భారత సైనికులు, 1857 స్వాతంత్ర్య పోరాటం లో మరణించిన దేశభక్తులు,ఇలా వీరందరి స్పూర్తితో 1947 లో వచ్చిన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోకుండా,దేశద్రోహుల చిత్రాలు పట్టుకుని విద్యాలయాల్లో తిరుగుతూ విద్రోహం వ్యాపింప చేస్తున్నారు. అమాయక విద్యార్థులను గందరగోళ పరుస్తున్నారు.అమాయక ఎస్ సి వర్గాల ప్రజలను ఒక ఎరగ ఉపయోగించుకుంటున్నారు.

దేశపౌరులంతా కులం, మతం,ప్రాంతం భేదాలు మరించి ఒక్కటై ఈ దేశద్రోహ ధోరణులను వ్యతిరేకించాలి. ఈ పని ఏ ఒక్క పార్టీ,విదార్థి సంస్థ తో కాదు..దేశభక్తి ఎవరి సొత్తూ కాదు.ఈ భూమి మీద పుట్టినందుకు దీని ఋణం తీర్చుకుందాం.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. దేశవిభజన జరిగిన కాలానికి,ఇప్పటికీ తేడా లేదు.

    అవే శక్తులు పడగ విప్పి నృత్యం చేస్తున్నాయి..


    దేశం లో సివిల్ వార్ నడుస్తున్నది. దేశ భక్తులపై సవాల్ విసురుతున్నది.


    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers