Tuesday, March 1, 2016

కరీంనగర్ జిల్లా న్యాయస్థాన మండపం లో డా.అంబేద్కర్ పై ప్రసంగ కార్యక్రమం








కరీంనగర్ జిల్లా న్యాయస్థానం లో డా అంబేద్కర్-జాతీయ సమగ్రత అను అంశం పై ప్రసంగ కార్య క్రమం ఫిబ్రవరి 11 న జరిగింది.న్యాయస్థానం ఆవరణ లోని సభా మంటపం లో జరిగిన ఈ కార్యక్రమానికి 1st అడిషినల్ న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీ బి.సురేశ్ గారు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా శ్రీ ఎల్ . నర్సింహా రెడ్డి గారు (పాట్నా ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి ) విచ్చేశారు..బార్ అసోషియేషన్ అధ్యక్షులు శ్రీ కొరివి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి శ్రీ రఘు మరియు అసోషియేషన్ సభ్యులు ఇతర న్యాయవాదులు నిర్వహించిన ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయింది.శ్రీమతి శీల ఆలాపించిన వందేమాతర గీతం అందరిని అలరించింది.డా అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు జాతి యావత్తు జరుపుకుంటున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ న్యాయస్థానం లో జరుపుకోవటం అభినందనీయం. సీనియర్ న్యాయమూర్తి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గా,పాట్నా న్యాయస్థానం న్యాయమూర్తిగా అనుభం గడించి,ఎందరో న్యాయవాదులకు ఆదర్శంగా నిలిచి,రాజ్యాంగ విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి సంక్లిష్టమైన కేసులను చేపట్టి, నిష్పక్షపాతంగా రాజ్యాంగానికి కట్టుబడి తీర్పులిచ్చిన న్యాయమూర్తి శ్రీ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా రావటం కరీంనగర్ న్యాయస్థానానికి రావటం ఒక ప్రేరణాదాయకం.
ఆయన ప్రసంగిస్తూ ' డా.అంబేద్కర్ జాతిసమైక్యతకు,దేశ రక్షణకు కట్టుబడి ధైర్యంగా నిలబడిన దేశభక్తుడని,మంచి దార్శనికుడని 'వివరించారు. 'దేశం లోని వైవిధ్య సమాజం లో ఒక ఏకరూపత నిచ్చే సంస్కృతి ని గుర్తించిన మహానుభావుడనీ చేప్పారు. నవంబర్ 25,1949 లో రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ' మన దేశంపైకి ఆక్రమణ చేయవచ్చిన మహ్మద్ బిన్ కాశిం,ఘోరి,అక్భర్,ఔరంగజేబ్,అలాగే అంగ్లేయులు మొదలైనవారికి సహకరించింది మన భారతీయులేనని,అందువల్లనే మనం ప్రతిసారి ఓఅడిపోతూ వచ్చామని చెబుతూ, చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకుని మనం సాధించిన స్వాతంత్ర్యాన్ని ఐక్యంగా వుండి కాపాడుకోవాలని అంబేద్కర్ భారతీయులకు ప్రభొధించారని నరసింహారెడ్డి గారు వివరించారు.
అంతకు ముందు ఫస్ట్ అడిషనల్ న్యాయమూర్తి శ్రీ ఎస్.సురేశ్ గారు మాట్లాడుతూ డా అంబేద్కర్ చిన్నప్పటి నుండి చదువుకుని అంచెలంచెలుగా ఎదిగిన సంఘటనలు వివరించారు..విదేశాలకు వెల్లి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, మన భారత రాజ్యాంగ రచనలో ప్రధాన పాత్ర పొషించారని శ్రీ సురేష్ గారు తెలియచేశారు.
బార్ అసోషియేషన్ అధ్యక్షులు శ్రీ కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ డా అంబేద్కర్ భారత జాతికి చేసిన సేవ అనుపమానమని చెప్పారు..తాను వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలకు లోనవుతూనే నిమ్నవర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడని వివరించారు.
ప్రధాన కార్యదర్శి శ్రీ రఘు అతిథులను వేదిక పైకి స్వాగతం పలికారు.అలాగే 'డా అంబెద్కర్ నవంబర్ 25న 1949 లో రాజ్యంగ సభలో ఇచ్చిన ప్రసంగ పాఠం జిరాక్స్ ప్రతులను న్యాయవాదులకు అందించారు.
ఈ కార్యక్రమం లో శ్రీయుతులు థర్డ్ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సుజన కలసికం, ఫిఫ్థ్ అడిషనల్ న్యాయమూర్తి శ్రీ డి.వాసుదేవ రావ్,సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీ కె.కుశ, అడిష్నల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.భవాని చంద్ర,ఫస్ట్ అడిష్నల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.మాధవి,సెకండ్ అడిషనల్ న్యాయమూర్తి శ్రీ మహ్మద్ అఫ్రొజ్ అఖ్తర్, స్పెషల్ ఎక్సైజ్ న్యాయస్థానం శ్రీ జి.శ్రీనివాస్, స్పెషల్ మొబైల్ న్యాయస్థానం శ్రీ అఝర్ హుస్సేన్, స్పెషల్ జె ఎఫ్ సి ఎం శ్రీ వి ఎల్ ఎన్ శర్మ తదితరులు పాల్గొని ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.

1 comment:

  1. కరీంనగర్ జిల్లా న్యాయస్థాన మండపం లో డా.అంబేద్కర్ పై ప్రసంగ కార్యక్రమం

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers