Friday, September 25, 2015

జ్యోతిబా గోవిందరావ్ ఫూలే - సమరసత


చత్రపతి శివాజి ని ప్రేరణగా, దయానంద సరస్వతి ని తోడుగా తీసుకుని జ్యొతిబా ఫులే ఉద్యమం.
పూలు,కూరగాయలు అమ్ముకునే వారి కుటుంబంలో జన్మించిన జ్యోతిబా గోవిందరావ్ ఫూలే శూద్రుల సామాజిక,విద్య,ఆర్థిక,రాజకీయ ఉన్నతి కోసం,సామాజిక సమానత కోసం పోరాడారు..దీనికై ఆయన శివాజి మరియు జార్జ్ వాషింగ్టన్ నుండి స్ఫూర్తి ని పొందారు.
అలాగే 1879లో ప్రథమ సాయుధ విప్లవకారుడు వాసుదేవ బలవంత్ ఫడ్కే గురువైన "లాహు జిబువా మాంగ్" అనే దళిత పహిల్వాన్ వద్ద ఫూలే పాఠాలు నేర్చుకున్నాడు.బ్రిటిష్ పాలన అంతమే లక్ష్యంగా ఫూలె మరియు అతని మిత్ర బృందం లో కలిగింది.
1869లో చత్రపతి శివాజి చరిత్ర మీద జానపద గీతం వ్రాశారు.శివాజిని నిమ్న కులాల నాయకునిగా పేర్కొన్నారు.రాళ్ళు,రప్పల మధ్య నిర్లక్షంగా పడివున్న శివాజి సమాధిని వెదికి గుర్తించి,స్వంత ఖర్చుతో దానిని దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు.
మౌలికంగా అందరి భగవంతుడొక్కడే అని ఆర్యసమాజ్ స్థాపకులైన దయానంద సరస్వతి తో కూడి,మహత్మ ఫూలె ప్రకటించాడు. ఆర్యసమాజ్ ఊరేగింపు లో ఫూలే పాల్గొన్నరు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. చత్రపతి శివాజి ని ప్రేరణగా, దయానంద సరస్వతి ని తోడుగా తీసుకుని జ్యొతిబా ఫులే ఉద్యమం.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers