Friday, September 25, 2015

ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పటం అబద్దం అని అంటారు డా.అంబెద్కర్


ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పటం అబద్దం అని అంటారు డా.అంబెద్కర్..
డా.అంబెద్కర్ చెప్పిన విషయం భారతీయ మేధావుల చెవులకు ఎక్కుతుందా.?ఆంగ్లేయులు సృష్టించిన ఆర్య సిద్ధాంతం తప్పని బి బి సి వారు స్వయంగా చెప్పినా అర్థం చేసుకునే తెలివి ఈ వామపక్ష మేధావులకు వుందా? అనుమానమే! ఆర్యులు బయటి వారనే అబద్ధాలు చదివి చదివి మన విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు.. నేటి కమ్యునిష్టు మేధావులకు ఇలా విద్యార్థులు కన్ ఫ్యూజ్ కి గురికావటమే వాళ్ళకు సంతోషం.
ఆర్య అనే శబ్దం ఒక గ్రూప్ కి గాని , జాతి కి గాని చెందినది కాదని ఆయన అంటారు. ఆర్యులు బయటి నుంచి వచ్చారనేది ఇప్పటి వరకు ఋజువు చేయలెకపోయారని డా అంబేద్కర్ తెలియజేసారు.
ఆర్య అంటే " మంచివాడు ' అని,,,అలాగే 'శ్రేష్టుడూ అని అర్థమని డా అంబేద్కర్ వివరించారు.
అయితే...మన భారతీయుల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టడానికి ఆంగ్లేయులు 'ఆర్య-ద్రావిడ 'అనే విష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వందల వేల ఏండ్ల క్రితం ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని ఆంగ్లేయుల కుట్రలో భాగంగా 1848 లో మాక్స్ ముల్లర్ ప్రతిపాదించి ప్రచారం చేశారు.దాన్ని పట్టుకుని మన దేశం లోని కమ్యూనిష్ట్ చరిత్రకారులు కాంగ్రెస్ ప్రభుత్వ కాలం లో మరింత మసాలా జోడించి మన పాఠ్య పుస్తకాల్లొ ముద్రించి చదివిస్తున్నారు.
స్వయంగా బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఆంగ్లేయుల ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది.అయినప్పటికీనీ భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి రాజకీయ నాయకులకు,కమ్యూనిష్టులకు,దేశవిద్రోహ శక్తులకు ఈ ఆర్య సిద్ధంతం ఒక తురుపు ముక్క వలె సమస్యలు సృష్టించడంలో సహాయపడుతున్నది.
ఆ ప్రభావం ఇంకా ఇప్పటికీ మన మధ్య కలహాలు,ద్వేషాలను రగిలిస్తుంది.
ఆర్యులు ఉత్తరభారతీయులని,వారు ద్రావిడులను అంటే దళితులని దక్షిణ ప్రాంతానికి తరిమికొట్టారని ఇప్పటికి అబద్దాలు ప్రచారం చేయటం లో విజయం సాధించారు..దళితులకు అలాగె ఇతర కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా వాదనలు లేవనెత్తుతున్నారు..
అయితే నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా అంబేద్కర్ మాత్రం ఆర్య సిద్ధాంతం తప్పని మరీ మరీ గట్టిగా చెప్పారు. డా.అంబెద్కర్ 'శూద్రులు ఎవరు ' అనే పుస్తకం లో ఇలా వ్రాసారు .
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం విదేశీ చరిత్ర కారులు కుట్ర తో వెలుగులోకి తెచ్చారు.ఋగ్వేదంలో 33 చోట్ల ఆర్య ప్రస్తావన వస్తుంది.అయితే ఆ శబ్దం జాతివాచకంగా వాడలేదు.'ఇంత స్పష్టంగా వేదాల్ని చదివిన డా అంబెద్కర్ మాటలను పెడ చెవిన పెట్టి,ఆయన పేరు చెప్పుకుని దళితులకు మిగతా కులాలకు మధ్య శతృత్వాన్ని కలిగించి,దేశద్రోహానికి పాల్పడే మేధావులను ఒక కంట కనిపెట్టాలి.
‘The theory of invasion is an invention. This invention is necessary because of a gratuitous assumption that the Indo-Germanic people are the purest of the modern representatives of the original Aryan race. The theory is based on nothing but pleasing assumptions, and inferences based on such assumptions. The theory is a perversion of scientific investigation. It is not allowed to evolve out of facts. On the contrary, the theory is preconceived and facts are selected to prove it. It falls to the ground at every point.’ (ref: B. R. Ambedkar, quoted by D.B. Thengadi in The Perspective [Sahitya Sindhu Prakashan]).
- అప్పాల ప్రసాద్.

2 comments:

 1. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పటం అబద్దం అని అంటారు డా.అంబెద్కర్..

  ReplyDelete
 2. ఆర్య సిద్ధాంతం తప్పని ఒప్పుకుంటే కొందరికి 'మేత' ఉండదు.
  దాన్ని అడ్డం పెట్టుకుని చాలా రాద్ధాంతం చేసారు కదా ఇప్పుడు మీరిలాగంటే ఎలా 'మేతేంఉండదే'

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers