Friday, September 25, 2015

సమరసత-మనం భారతీయులుగా నిజంగానే గర్విస్తే ఆచరణ లో మన ఐక్యతను చూపాలి


మనం భారతీయులుగా నిజంగానే గర్విస్తే ఆచరణ లో మన ఐక్యతను చూపాల.
ఆవులు అనేక రంగులతోనూ,అనేక స్వరూపాలతోనూ వున్నప్పటికినీ వాటి పాలు ఒకే విధంగా వుంటాయి.అలాగే,మానవులు అనేక రకాలుగా వున్నా కూడా వారిలొ ఆత్మ స్వరూపం ఒకే విధంగా వుంటుందని వశిష్ట గీత తెలుపుతుంది.
"గవామనేక వర్ణానాం క్షీరస్యా స్యేకవర్ణతా
క్షీరవతృశ్యతే జ్ఞానం లింగిస్తూ గవాం యథా....:వశిష్ట గీత:
భౌతిక శాస్త్రం కూడా అన్ని వస్తువుల్లోనూ (ఆటం) పరమాణువు ఎలా వుంటుందో,అలాగే మన హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ప్రాణం వున్నవి,లేని వాటిల్లో కూడా " ఆత్మ" వుందని ప్రకటించింది.
అలా హిందూ ధర్మం ప్రకటించిన అంశాల్ని ఆచరణ రూపం లోకి తేవటం మన భారతీయుల బాధ్యత.
ముస్లిముల మరియు ఆంగ్లేయుల పరిపాలన కాలం లో కరడుగట్టిన సామాజిక దురాచారాలను తొలగించకపొతే మన దేశం ప్రగతి చెందదు.
వేల సంవత్సరాలుగా వున్న వికృతులను తొలగించాంటే మన మనసుల్లో గూడు కట్టుకున్న అభిప్రాయాలను ఒకసారి నేటి పరిస్థితులకు అనుగుణంగా అలోచించాలి.అగ్రవర్ణాలైనా,బిసి లైనా,ఎస్ సి లైనా మన వ్యవహారాల వల్ల మనమంతా హిందువులం, కలిసి వుండాలనే భావన నిర్మాణం కావాలి..కుల దురహంకారం, ఇతర కులాల పట్ల ద్వేష భావన తొలగించుకోవాలి. మనను విడదీసి దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని కొన్ని చదువుకున్న అజ్ఞాన గుంటనక్కలు కాచుకుని కూర్చున్నాయి.మన వ్యక్తిగత హక్కులు కాదు కదా,సమాజం ముక్కలైన తరువాత ఆలోచించేదేమీ ఇక మిగలదు..
2011 డిశంబర్ 6 న డా.అబ్దుల్ కలాం ఇలా అన్నారు." వ్యక్తులు,సమాజాలు,అలాగె రాజకీయ పార్టీల కంటే గొప్పది దేశం.వ్యక్తిగతంగా,సామాజికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవటమే దానికి కారణం."

దా.అంబేద్కర్ కూడా ఇలా అన్నారు." నా దేశవాసులు కొన్నిరోజులకైనా అర్థం చేసుకుంటారని నాకు ఆశ వుంది..అదేమిటంటే వ్యక్తుల కంటే దేశం ముఖ్యమని."
ఋగ్వేదం కూడా చెపుతుంది "ఎవరు ఎవరిని ఏ పేర్లతో ఆరాధించినప్పటికినీ సత్యం ఒక్కటేనని ".
-  అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సమరసత-మనం భారతీయులుగా నిజంగానే గర్విస్తే ఆచరణ లో మన ఐక్యతను చూపాలి

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers