Friday, September 25, 2015

సామాజిక ఉద్యమం లో బ్రాహ్మణులను ఆహ్వానించిన డా.అంబేద్కర్.


స్వార్థం కోసం నేడు దళితులను మిగతా వర్గాల నుండి వేరు చేస్తున్న దళిత నాయకులు.
1927 మహద్ చెరువు సత్యాగ్రహ సమయం లో అంబేద్కర్ స్థాపించిన సత్యశోధక్ మండలి నాయకుడు భేదజవద్కర్ సత్యగ్రహం లోకి బ్రాహ్మణులను పిలిస్తే తాను పాల్గొనని అన్నప్పుడు...డా అంబేద్కర్ ఒంటెత్తు పోకడ పనికి రాదని అన్ని వర్గాల సహకరం తో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని,అలా అని ఎవరిపై ఆధారపడి వుండొద్దని సలహా ఇస్తాడు.
అంబేద్కర్ చనిపోయి 40 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ తాము దిక్కులేనివారమేనని భావిస్తూ ,పేద ప్రజానీకం దిక్కుతోచని స్థితిలో వుందని చెప్పటం అబద్దం కాదు.
వీరి దగ్గరకు డా అంబెద్కర్ పేరు చెప్పి రక రకాల నినాదాలతో వెల్తున్నారు.రాజకీయ స్వార్థం కోసం కొందరు...మత మార్పిడి రజకీయాల కోసం కొందరు...పేదరికం,అజ్ఞానాన్ని ఉపయోగించుకుని వారిని పావులుగ ఉపయోగించుకుంటున్నవారు కొందరు..డా.అంబెద్కర్ ఇచ్చిన హక్కులను పొంది ఒకే కుటుంబంలో 15 కి పైగా ఐ ఏ ఎస్ చదువులు చదివి క్రైస్తవానికి దగ్గరగా హిందుత్వాన్ని వ్యతిరేకించి,ఒక మతానికి కొమ్ము కాస్తూ,తోటి దళితులను పట్టించుకోని ( డా.అంబేద్కర్ కి హిందుత్వం పట్ల ద్వేషం లేదు.క్రైస్తవ,ఇస్లాం,కమ్యునిష్టు ల సిద్ధాంతాలపై ధృఢమైన అభిప్రాయాలు వున్నాయి) విద్యావంతులు కొందరు ..నిజంగా దళితులను కష్టాలనుండి బయటపడవేసే ప్రణాళికల కంటే హిందూ ధర్మాన్ని తిట్టి పోయటం లోనూ, దళితులను మిగతా సమాజం నుండి వేరు చేసే ప్రయత్నం లోనూ బిజీ బిజీగ వున్నారు..దానికి గాను కోట్ల ధనం మిషనరీల నుండి వీళ్ళలో కొందరికి ముట్టుతున్నదని అందరికీ తెలిసిందే..
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సామాజిక ఉద్యమం లో బ్రాహ్మణులను ఆహ్వానించిన డా.అంబేద్కర్.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers