Saturday, December 13, 2014

డా.బాబా సాహెబ్ భీం రావ్ రాంజీ అంబెద్కర్ కి అనుక్షణం సహకరించిన వారిలో ఎంతమంది దళితులున్నారు?

ఎక్కువ మంది ఇతర కులాల వారున్నారంటె అతిశయోక్తి కాదు.


*భీం రావ్ పేరు చివరన వుండే అంబేద్కర్ ...వారి గురువు గారిది. భీం రావ్ పైన అభిమానం తో తన పేరు తగిలించి రిజిస్టర్ చేయించాడు. ఆ గురువు బ్రాహ్మణుడు.

*భీం రావ్ జీవితం లో ఎదగాలని కాంక్షించే వారిలో ఒకరు క్రిష్ణాజి అర్జున కేలూస్కర్,అలాగే మరొక సంస్కర్త ఎస్.కె.భోలే.

*భీమ్రావ్ కి ఆప్తమిత్రుడు పార్శీ విద్యార్థి నావల్ భతానా.

*భీం రావ్ విద్య కోసం ఆర్థిక సహాయం చెసిన వారు బరోడా మహరాజు శాయాజీ రావ్ గైక్వాడ్.

*భీం రావ్ సాధించిన విజయాలకు సన్మాన సభ పెట్టింది శంభాజి వాఘ్మరే.అధ్యక్షత వహించింది రావ్ బహదూర్ చునీలాల్ సెతల్వాడ్.

*1918 మార్చ్ లో జరిగిన అఖిల భారత సభలో పాల్గొని అంటరానితనం నిర్మూలించాలని చెప్పిన ప్రముఖులు విఠల్ భాయి పటేల్,బిపిన్ చంద్ర పాల్,ఎం.ఆర్.జయకర్.

*1924 లొ సాంఘిక సంస్కరణోద్యంలో పాల్గొని మద్దతిచ్చిన వారు....చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాడ్,బొంబాయి ముఖ్య మంత్రి బి.జి.ఖేర్.ఆర్.పి.పరంజపే,డా.వి.పి.చవాన్ తదితరులు.

*కులతత్వాన్ని నిరసించిన వారిలో...స్వాతంత్ర్య వీర సావర్కర్,స్వామి శ్రద్ధానంద,లాలా లజపత్ రాయ్,రాజా రామోహన్ రాయ్,అరవింద ఘోష్,భాయి పరమానంద,వీరందరూ అకుంఠిత దేశభక్తులు.

*1936 సంక్రాంతి రోజున ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.హెడ్గేవార్ ఆహ్వానం మేరకు పూనా శాఖలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు.

*హిందూ మహాసభ నాయకులు డా.బి.ఎస్.మూంజె నుండి ఆశీర్వాదాలు తీసుకుని మతం మారాలని నిర్ణయించుకున్నారు.

*గాంధీజీ సలహా మేరకు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి,ఫ్రాన్స్ కి చెందిన వ్యక్తికి కాకుండా,డా.అంబెద్కర్ కి అప్పగించడమైంది.

*7-8 సంవత్సరాల పాటు డా.భీం రావ్ అంబేద్కర్ బాగా అభిమానించి తన దగ్గర వుంచుకున్న వ్యక్తి ఆర్.ఎస్.ఎస్.కార్యకర్త దత్తొపంత్ థేంగ్డి.

*మహరాష్ట్ర భండారా ఉప ఎన్నికల్లో అంబెద్కర్ కి మద్దతివ్వాలని ఆర్.ఎస్.ఎస్ స్వయం సేవకులకు ప్రత్యేక సూచన ఇచ్చింది అప్పటి ఆర్.ఎస్.ఎస్. అధ్యక్షుడు మాదవ రావ్ గోల్వాల్కర్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers