Saturday, December 13, 2014

అంటరానితనం రుచి ఒకసారి స్వయంగా అనుభవించి చూస్తారా?


*అంబేద్కర్ తన పెద్దన్నతో,తన అన్నకుమారుడితో కలిసి గోరేగావ్ కి వెల్లటానికి రైలు ఎక్కి స్టేషన్ లొ దిగి ఎడ్ల బండిపై వెలుతుంటే,ఈ ముగ్గురు అంటరాని కులానికి చెందిన వారని భావించి,బండి తోలేవాడు దిగి వెళ్ళిపోయాడు.పైసలు ఎక్కువిచ్చి తన బండి తోలేటట్లుగ ఒప్పందం చేసుకుని గోరేగావ్ చేరుకున్నారు.

*ఆ ప్రయాణం లో దాహం వేసి నాలుక పిడుచ కట్టుకుని పోతుంటే,ఎవరూ కూడా మంచి నీళ్ళు ఇవ్వలేదు.పైగా మురికి గుంటలు చూపించారు.

*అలాగే తాను జుట్టు కత్తిరించుకుందామని మంగలి వద్దకు వెళ్తే నిరాకరించాడు.పైగా ఆ మంగలి ఒక గేదె దూడ వెంట్రుకలు కత్తిరిస్తున్న దృశ్యం కనిపించింది.

*ఎల్ఫిన్స్టన్ ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చేయలేని లెక్కలను అంబెద్కర్ బోర్డ్ పై చేయమని ఉపాధ్యాయుడు పిలిచినప్పుడు, మిగతా విద్యార్థులు భయపడిపోయి,వెంటనే లేచి, ఆ బోర్డ్ వెనక దాచుకున్న టిఫిన్ బాక్స్ ల ను తేసేసుకున్నరు..అంబెద్కర్ ముట్టితే అవి మైల పడిపోతాయనుకున్నరు.

*తరగతి గదిలో విద్యార్థులంతా ఒక ప్రక్కన కూర్చుంటే,తాను ,తన అన్న ఇద్దరూ మరో వైపు ఒక గోనె సంచి వేసుకుని కూర్చునే వారు..

*డా.అంబెద్కర్ అమెరిక నుంచి వచ్చిన తరువాత ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం 1917 ఆగష్ట్ 21 న ముంబాయి లో ఏర్పాటు చేశారు.కాని ఆ సభ కు వెల్ల లేదు..తన గురించి అంచనా వేసుకున్నాడేమో,సిగ్గు పడ్డాడేమో కాని ఆయన హాజరు కాలేదు.

*రైల్వే స్టేషన్ కి వెళ్ళి స్వాగతం చెప్పి అంబెద్కర్ ని తీసుకుని రమ్మని బరోడా మహరాజు తమ ఉద్యోగులకు చెప్పినా స్టేషన్ కి ఎవరూ వెళ్ళలెదు.

*బరోడా సంస్థానం లో ఉద్యోగం దొరికినప్పటికినీ ఆయన ఫైళ్ళను ఎవరూ ముట్టేవారు కాదు. ఉద్యోగులేమో ఫైళ్ళను విసిరివేసేవారు.అలాగే కనీసం మంచి నీళ్ళు తెచ్చేవారు కూడా కరువయ్యారు.పెద్ద చదువులు చదివి,ఉద్యోగం సాధించినా వివక్షత కొనసాగుతునే వుంది.

*హోటళ్ళలో,హాస్టళ్ళలో,సత్రాల్లో ఎక్కడా అంబెద్కర్ కి వసతి దొరకలేదు.చివరికి ఒక పార్శి సత్రానికి వెల్లి,మారుపేరు చెప్పి చేరితే, ఒక రోజు ఈ విషయం తెలిసిన పార్శీలు కర్రలు పట్టుకుని వచ్చి నానా దుర్భాషలాడారు.

*ఇదంతా అనుభవిస్తూనే డా.అంబేద్కర్ ఒక చెట్టు క్రింద కూర్చుని అలసటతో,నిరాశతో కన్నీళ్ళు ధారగా వస్తుంటే భోరున ఏడ్చాడు. చదువుకున్నవాడి తన పరిస్థితే ఇలా వుంటే తన తోటి నిరక్షరాస్యులైన 6 కోట్ల పేద,దళిత ప్రజల భవిష్యత్తు ఎలా వుండబోతుందోనని విలపించిన మహాను భావుడు.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers