Saturday, December 13, 2014

తండ్రిని మించిన తనయుడు...రాముని కడుపులో భీముడు..


 డా.అంబెద్కర్ తండ్రి రాంజీ సక్పాల్ సైన్యంలో పనిచెసేవాడు.ప్రొద్దునా సాయంత్రం పిల్లలను కూర్చోపెట్టుకుని భక్తిగీతాలు,కథలు చెప్పేవాడు.రామాయణం,భారతం సంఘటనలు వినిపించేవాడు.రాంజీ మద్యం,మాంసం ముట్టేవాడు కాదు.విచిత్రమేమిటంటే రాంజీ తండ్రి, అంటే అంబేద్కర్ తాత సన్యాసి గా మారి భక్తి ప్రచారం చేశాడని చెపుతారు. 1892 లో మహర్ కులస్థులను సైన్యంలోకి తీసుకోరాదని ఆంగ్ల ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు మహాత్మా జ్యోతిబా ఫులె ప్రెరణతో ,మహదేవ గోవింద రానడే సహాయం తో రాంజీ సక్పాల్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిషేధాన్ని తొలగింపచేశాడు. నిమ్న వర్గాల కొరకు ఇండ్లు నిర్మించే పథకాన్ని ముంబయి గవర్నర్ తో మాట్లాడి సాధించుకున్నాడు. ధైర్యవంతుడు,భక్తి తత్పరుడైన 'పులి ' వంటి రాంజీ సక్పాల్ ఇంట్లో పిల్లి ఎలా పుడుతుంది? అదే ధైర్యం కలిగిన వాడిగా, ధర్మం లో విశ్వాసమున్న వాడిగా డా.అంబెద్కర్ 1891 ఏప్రిల్ 14 న 14 వ సంతానంగా జన్మించాడు. డా.అంబేద్కర్ కి ఆరేళ్ళ వయస్సులో తల్లి మరణించింది. తల్లి లేని లోటును అక్కలు,మేనత్త తీర్చారు. పెంచి పెద్ద చేసారు. రాంజీ రెండవ వివాహం చేసుకున్నాడు.కొడుకు అంబెద్కర్ కి పుస్తకాలు సమకూర్చి చదువు చెప్పించేవాడు.అప్పు తెచ్చైన సరే బడికి పంపేవాడు.ఒక పాత పశువుల కొట్టం వాళ్ళ వసతి.ఒక ప్రక్క పశువులు,మరో ప్రక్క ఒక బొంత వేసుకుని నిద్ర పోయేవారు.పెందల కడనే అంబేద్కర్ నిద్ర పోయేవాడు.రాత్రి 2 గంటల వరకు రాంజీ భక్తి గీతాలు పాడుకుంటు వుండే వాడు.ఆ తరువాత అంబెద్కర్ ని నిద్ర లేపి చదువుకోమని చెప్పి, అదే బొంత మీద తాను నిద్రించేవాడు. డా.అంబేద్కర్ 17 ఏళ్ళ వయసులో రమా బాయి తో వివాహం జరిగింది. పేదరికం ,సంసార భారం...అయినా ఏముంది? డా.అంబేద్కర్ గొప్పవాడు కావటానికి తన పేదరికం అడ్డు రాలేదని చెప్పటానికి ఈ ఉదాహరణలు సరిపోవా?

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers