Saturday, December 13, 2014

సామాజిక వేత్త డా.భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ వర్ధంతి రోజున దేశమంతా అన్ని వర్గాలు ఆ మహానుభావుడికి నివాళులర్పించారు.


సామాజిక వేత్త డా.భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ వర్ధంతి రోజున దేశమంతా అన్ని వర్గాలు ఆ మహానుభావుడికి నివాళులర్పించారు.ఆయన ఒక జాతికి(వర్గానికి) కాదు,జాతీయ నాయకుడిగా ఆయనను గౌరవించాలి.ఆయన జీవిత కాలంలో ఆయన ఎదుర్కొన్న వివక్షతలు,కష్టాలు ఎన్నున్నా, వారు చనిపోయిన తరువాత మహాత్ముడిగా గుర్తించబడుతున్నారు.ఇది సహజం.మనం చేసే మంచి పనులకు నేటి సమాజం లో అంగీకారం లభించక పోయినా, వచ్చే తరాలు మన ఆశయాలను గుర్తించి వాటిని ఆచరిస్తాయన్న విశ్వాసం తో పని చేయటమే మన కర్తవ్యమని డా.అంబెద్కర్ చెప్పకనే చెప్పాడు. మొదటి సారిగా వేములవాడ శిశుమందిర్ పాఠశాల లో ప్రధానాచార్య శ్రీ రమేష్,మోటూరి శంకరయ్య,గర్శకుర్తి వెంకన్న,మున్సిపల్ చైర్మన్ ఉమ లక్ష్మిరాజం తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్ఫూర్తి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో డా.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ మనోహర్ రెడ్డి,జె ఎ సి చైర్మన్ కనకయ్య,నూకలమర్రి సర్పంచ్ వెంకటేశ్,బాలు,ప్రవీణ్,తిరుపతి,ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ సామాజిక సమరసతా నాయకులు మనోహర్ రావ్,సామ రమేష్,రాజెశ్,గంగారెడ్డి,వామన్రావ్ తదితరులు డా.అంబెద్కర్ చిత్రానికి పూలమాల వేస్తూ పాల్గొన్నారు

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers