Saturday, December 13, 2014

ఈ 4 ప్రశ్నలు 1927 లో డా.అంబేద్కర్ సంధించాడు.వీనికి అప్పుడైనా,ఇప్పుడైనా జవాబులు చెప్పగలరా?


1927 మార్చ్ 19,20 తేదీల్లో మహద్ పట్టణం లో దలిత సభలు జరిగాయి. 1924 లో ఆ పట్టణం లోని చెరువును ప్రజలంతా ఉపయొగించాలని మహద్ పురపాలక సంఘం తీర్మానం చేసిన తరువత కూడా ఆ వూరి పెద్దలు తిరస్కరించడం తో 10 వేల మంది అక్కడ గుమికూడారు.పట్టణం లోని పెద్దలు కర్రలతో దాడి చేసారు. డా.అంబెద్కర్ చాల తెలివిగా అహింసా యుతంగా ఆ ఉద్యమాన్ని నడిపించారు.స్వాతత్ర్య వీర సావర్కర్ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు..దళితులతో పాటు అన్ని వర్గాల వారు అంబెద్కర్ ని అనుసరించారు..

అప్పుడు అంబెద్కర్ దళితేతర ప్రజలు ముఖ్యంగా పెద్దలకు విసిరిన ప్రశ్నలు.

1. మీరు చెరువును తాకినప్పుడు, మేము మనుష్యులమే కద? మేమెందుకు తాక కూడదు?

2.మీరే కాకుండా మీ ఇళ్ళల్లోని మేకలు,ఎద్దులు,బర్రెలు ఈ చెరువును తాకవచ్చును..మరి మేమెందుకు తాక కూడదు?

3.మీ ఇండ్ల లోని పశువులు తాకవచ్చు..అలాగే మా ఇళ్ళలో వున్న పశువులు బర్రెలు,మేకలు,ఎద్దులు కూడా తాకవచ్చును.మరి మేమెందుకు తాక కూడదు?

4.మీరు తాకితే ఫరవాలెదు.మేము మాత్రం తాకితే మైల పడి పోయి,మీరు గోమూత్రం చల్లితే పవిత్రం అవుతుందా?

సభ్య సమాజం ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలెక తలలు దించుకుంది.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers