Saturday, December 13, 2014

సామాజిక స్వేచ్చ కోసం డా.అంబెద్కర్ నాసిక్ లో జరిపిన కాలారాం మందిర్ సత్యాగ్రహం చరిత్రలో నిలిచిపోతుంది


మహాత్మా గాంధీజీ 1930 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహానికి శ్రీకారం చుట్టాడు.. అదే సంవత్సరం లొ మార్చ్ 2 ఆదివారం రోజు 
.

గుళ్ళోకి దళితులకు ప్రవేశం లేదని పూజారి మరియు ఆలయ నిర్వాహకులు చెప్పినప్పుడు,ద:ఇత ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి,3 వేల మంది భజనలు,పాటలు పాడుతూ పాల్గొన్నారు.500 మంది మహిళలు పాల్గొన్నారు.సత్యాగ్రహం నెల రోజులు సాగింది..

కోట్లాది దళితుల హృదయాల్లో నెలకొని వున్న శ్రీ రాముడు నెలవైన కాలారం మందిర్ లోకి ప్రవేశం ఎందుకు లేదు ? అని ప్రశ్నించినప్పుడు శ్రీ రాముని పట్ల వారి భక్తి ప్రపత్తులకు ఆ భగవంతుడే కదలిపోయాడు.5 సంవత్సారాల పాటు ఆ ఉద్యమం కొనసాగిందంటే అంటరానితనమనే దురాచారం ఎంత తీవ్రంగా వుండెదో అర్థం చేసుకోవాలి.

అప్పటి పూజారి మనుమడు,తన తాత చెసిన పాపానికి ప్రాయశ్చిత్త పడి ఆ తరువాతి కాలంలో దళితులందరిని సాదరంగా ఆహ్వానించి ఆలయం లో పూజలు జరిపించాడు.

స్వాతంత్ర్య వీర సావర్కర్ ఒక పతిత పావన మందిరాన్ని నిర్మించి,అందులో ఒక దళిత పూజారి నియమించి ఏకత్వాన్ని చాటి చెప్పాడు.

వేదాల్లో,ఉపనిషత్తుల్లో ఎక్కడా కానరాని ఈ దురాచారం సుమారుగా 3-4 శతాబ్దాల్లో వచ్చిపడిందని స్వయంగా డా అంబేద్కర్ ప్రకటించి,దాన్ని సమూలంగా తొలగించాలని తపనపడి,ఉద్యమించిన హిందూ సంస్కరణ వాది.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers