Wednesday, October 8, 2014

ఈ యువకులు అందరికి ఆదర్శం


ఈ యువకులు దసరా రోజున కొనాపూర్ గ్రామం నుండి పొలిమేర దాటి,శమీ ఆకు(బంగారం) తేవడానికి వెళ్తూ కలిసారు..రాజకీయనాయకుల ప్రలోభాలకు లోనై, వాళ్ళకు అడుగులకు మడుగులొత్తే వారు కాదు..కోనాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని వాళ్ళ కోరిక. 45 మందికి పైగా రక్తదానం చేసారు.వివేకానందుని విగ్రహాన్ని వూర్లో పెట్టారు..అందరి కులపెద్దల సమావేశం పెట్టి, సామరస్యతకు నాంది పలికారు..వీళ్ళ ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం.

దసరా పండుగ మనకు మన పెద్దలు ఇచ్చిన వరం.

*గొప్ప పండితుడైనా, స్త్రీలను అవమానిస్తే చావు తప్పదని, ఈ రోజు రావణ వధతో మంచిని లోకానికి చాటిన రాముని వారసులం మనం.

*ఒక సంవత్సరం పాటు అజ్ఞాతంగా వుంటూ తమ ఆయుధాలకు ఆశ్రయమిచ్చి కాపాడిన శమీ వృక్షం(బంగారం) శక్తికి ప్రతీక యని, ఆవుల్ని దొంగిలించుకుని పోయి,పాండవుల వ్రతదీక్షను భంగం చేద్దమని భావించిన గర్వపోతులు కౌరవులకు బుద్ధి చెప్పిన గోగ్రహణ రోజు ఇదే..ఆ శమీ ఆకుని పెద్దలకు ఇచ్చి కాళ్ళు మొక్కే వినయాన్ని నేర్పే సంస్కారపు రోజు.

*మనం సంపాదించిన దానిని ప్రజలకే దానం చేయాలన్న మంచి ఆశయాన్ని చాటి చెప్పిన రఘుమహారాజు ఆదర్శంగా నిలిచిన రోజు..

*తన తల్లి బానిసత్వలో వుంటే,ఆ దాస్యాన్నుండి విముక్తి చేయటం కోసం,అమృతం తెచ్చిన కుమారుడు గరుత్మంతుడుని పాలపిట్టగా దర్శించుకునే రాజు.

*పురుషులకంటే మహిళల్లోనే దివ్యత్వ లక్షణాలున్నయని,దేవుళ్ళందరికీ శక్తి రూపిణియై,అందరికీ ప్రెరణగా నిలిచి, స్త్రీలను గౌరవించి,సుహాసిణీ పూజ చేసే రోజు..

*విడిపోటే ఓడిపొతాం,కలిసి వుంటే గెలుస్తాం అని చెప్పి,అందరిని నిత్యం కలిపి దేశం కోసం జీవించె వ్యక్తులను నిర్మించే ఆర్ ఎస్ ఎస్ మొదలయ్యింది ఈ రోజు.

ఏది ఏమైనా మన పెద్దలు ఎప్పుడో పెట్టిన ఈ ఆచారం ఇంకా కొనసాగటం మన అదృష్టం.మన హిందూ సంస్కృతికి చావులేదనటానికి ఈ పండుగల కొనసాగింపే ఒక ఉదాహరణ.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers