Wednesday, October 8, 2014

బలమైన భారత దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు


బలమైన భారత దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు అంటారు కదా..ఎందుకు? శుభకార్యమైనా,అమంగళమైనా గ్రామాల్లోని వృత్తుల వారు చేసే పని అందరికి ఆదర్శం.అందరి చేతికి పని కల్పించి,అందరితొ కలిసి జీవించే విధానమిది..వారి శ్రమైకజీవనమే పచ్చని గ్రామ వికాసానికి ఆధారం.నేడు .వ్యవసాయం కుంటుపడుతుంది.చేతివృత్తులు చేయిజారిపోయాయి..ఇప్పటికీ 7,50,000 గ్రామాలతో విలసిల్లే భారత్ లో ఆ వృత్తులకు మళ్ళీ గౌరవం లభించాలి.ఇప్పటి పరిస్థితులకనుగుణంగా వారికి ప్రోత్సాహం అందించాలి..రాజకీయాల రొంపిలో చెమటోడ్చే ఈ పని వారలను పిలిచి గౌరవంగా సన్మానించే పనికి శ్రీకారం చుట్టింది సామాజిక సమరసతా వేదిక..

దసరా పండుగ రోజున రామాయం పేట మండలం లోని నార్లాపూర్ గ్రామంలో ..అలాగే దసరా మరుసటి రోజు తూప్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామంలో . అక్కడి యువకులు పెద్దలను పిలిచి, గతంతో వర్తమానాన్ని జోడించి భవిష్యత్తు భారతానికి వారధి కడుతున్న ఈ యువకులకు అభినందనలు.

కమ్మరి,వడ్రంగి,ఔసలి,డప్పు కొట్టేవారు,స్మశానం లో కాటికాపరి,తలారి,చనిపోయిన పశువులను బొంద పెట్టేవారు,దర్జీ,నేత నేసేవారు,చాకలి,మంగలి,గీతపనివారు,పశువుల కాసే వారు,సహజంగా కానుపు చేసే మహిళ ఇలా వృత్తులు చేసే ఆదర్శమూర్తులకు నమస్కారాలు.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers