Friday, September 19, 2014

బతుకమ్మ


అందరినీ కలుపుకుని పోయేది,అందరితో కలిసిపోయే సంస్కృతి మనది. ఆ సంస్కృతి కి ప్రతిబింబం మన మాతృమూర్తులు.వీళ్ళు ఆచరించే పండుగలు కూడా అటువంటివే..ఆడపిల్లలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి, ఆడపిల్లకు సంస్కారాన్నిచ్చే విధంగా రూపొందిన పండుగలెన్నో...అందులో 'బతుకమ్మ ' ఒకటి. పెద్దలను గౌరవించాలని,భర్తతొ అనుమానం లేకుండా కాపురం చేయాలని,అత్త,మామలను సేవించాలని, భర్త ఇల్లే స్వర్గమని ఆడపిల్లలకు ముద్దుమాటలు చెప్పి కుటుంబాలను నిలుపుకోవాలని జానపద పాటల రూపంలో తెలిపే అపురూపమైన పండుగ ఇది. 
కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు అన్ని వీధుల్లో సమరసతతో ఆడుకునే సంబరాల బతుకమ్మ ఉత్సవం.
'చల్లగా బతుకమ్మా ' అంటూ దీవించే హిందువుల పండుగ ఇది.

దక్షిణ భారత దేశాన్ని పాలించిన 'ధర్మాంగదుడు ' అనే రాజు మరియు అతని భార్య 'సత్యవతి ' ల పుత్రిక పేరు బతుకమ్మ..అంతకంటే ముందు జన్మించిన సంతానం యుద్ధాల్లో చనిపోతే లక్ష్మీ దేవిని పూజించినందు వల్ల కలిగిన ఈ బిడ్డకు నూరేండ్లు బతుకాలని పెట్టిన పేరు బతుకమ్మ..
తెలుగు నెల 'భాద్రపద ' అమావాస్య నుండి 9 రోజుల పాటు తెలంగాణాలోని హిందూ మహిళలు ప్రతిరోజూ మరో తెలుగు నెల 'ఆశ్వయుజ ' అష్టమి వరకు బతుకమ్మ పండుగ చేస్తారు.చివరి రోజును అంటే దుర్గా అష్టమి రోజు 'సద్దుల బతుకమ్మ ' గా 'పెద్ద బతుకమ్మ 'గా పండుగ జరుపుకుంటారు..

దక్ష యజ్ఞం లో పడిపోయిన శివుని భార్య ' సతీ దేవి 'ని తిరిగి రమ్మని పూజించే పండుగ గా బతుకమ్మ ని కొలుస్తారని ప్రతీతి.
హిందూ మహిళలు,ఆడపిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఆ ఋతువు లొ దొరికే పూలు...గునుగు (Celosia), తంగెడు (Senna auriculata), బంతి (Tagetes), చామంతి (Chrysanthemum), తామెర పువ్వు(Nelumbo nucifera), గుమ్మడి ఆకులు & పువ్వులు (Cucurbita), దోస ఆకులు & పువ్వులు (Cucumis Sativus), అల్లి (Memecylon edule), గడ్డి పువ్వు(Tridax procumbens), వామ పువ్వు (Trachyspermum ammi),
కట్ల పువ్వులు,టేకు పువ్వులు సేకరించి, 7 వరుసలు గుండ్రంగా పేర్చి, దాని పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి, ఒక మైదానములొ మహిళలు పెద్దమొత్తంలో గుమిగూడి,బతుకమ్మలను మధ్యలొ పెట్టి,వాటి చుట్టూ తిరుగుతూ జానపద శైలిలో పాటలు పాడుతూ,లయబద్ధంగా చప్పట్లు కొడుతూ,ఆడే ఆనందమైన,ఆహ్లాదమైన పండుగ...బతుకమ్మ...
ఈ బతుకమ్మకు నవధాన్యాలతో వంటలు వండి,Corn (మొక్క జొన్నలు), Sorghum (జొన్నలు), Bajra (సజ్జలు), Black Gram (మినుములు), Bengal Gram (శనగలు), Green Gram (పెసర్లు), Ground Nuts (పల్లి), Sesame (నువ్వులు), Wheat (గోధుమలు), Rice (బియ్యము), Cashew Nut (జీడిపప్పు), Jaggery (బెల్లం), Milk (పాలు) నైవేద్యం పెట్టి,,అందరికి పెడతారు. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తారు (చీమలు ఆ పిండి ని తింటాయి..మోసుకుని పోయి దాచుకుంటాయి)..
ఈ పండుగ చేస్తే లక్ష్మి అంటే సంపద ఇంటికి వస్తుందని నమ్మకం..ఆడపిల్లలకు మంచి వరుడు దొరుకుతాడని విశ్వాసం.
బతుకమ్మను చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు..దీపం పెట్టి హారతిస్తారు.మళ్ళీ రమ్మంటూ కోరుకుంటారు..

బతుకమ్మ,గౌరమ్మ..లక్ష్మి,సరస్వతి,పార్వతి..ఇలా ఏ పేరున పిలిచినా మహిళలను తల్లిగా గౌరవించాలనే భారతీయ సంప్రదాయం ఇప్పటికీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers