Friday, September 19, 2014

సమరసతా సమభావం పాట


పాటను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

సమరసతా సమభావం - సుమధుర బంధనం
వివేకుని సందేశం - ఆనంద చందనం
దేహమే దేవాలయంగా - దీనులను ఆరాధిద్దాం
దేశమంతా కలుపుకుంటూ - భేదాలు తుడిచివేద్దాం
నిరుపేద ఇంటిలో -కడుపు నింపుదాం
నిర్భాగ్య జీవిలో - విశ్వాసముంచుదాం ..!!

సవర్ణులు,దళితులనే తేడాలేలా?
దురాచార వేదనలకు అంతే లేదా?
చీకటే క్రమ్మిందా - దూరమే పెరిగిందా
ప్రేమ పిలుపుతో -తేనెలొలుకుదాం
స్వార్థమే వచ్చిందా - అహమే పెరిగిందా
త్యాగమూర్తిలా - సేవచేయుదాం
ఎన్ని అడ్డంకులు వున్నా, అంతరాలు వున్నా
అన్నదమ్ములం,అందరమొకటై అల్లుకుపోదామా...!!  

ప్రతి హృదయం హాయిగ నవ్వే రోజులు రావాలి
ప్రతి మనిషి బ్రతుకులోన వెన్నెల కురవాలి
దు:ఖితులు వచ్చారా - పీడితులు వున్నారా 
అన్నార్తులందరూ - దైవరూపులే
మహనీయులొచ్చారా - మంచిమాట చెప్పారా
పరమ హంసలా - వివేకనందలా 
ఎన్ని అడ్డంకులు వున్నా, అంతరాలు వున్నా
అన్నదమ్ములం,అందరమొకటై అల్లుకుపోదామా...!!   


పాటను వీడియో రూపంలో ఇక్కడ చూడండి....

రచన: అప్పాల ప్రసాద్.
స్వరం: చక్రి.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers