Friday, October 10, 2014

కొట్లాటలు,ఘర్షణలు,కలతలు లేని హిందూ సమాజాన్ని చూడాలని కలలు గన్న కార్యక్రమం ఇది.
పైపైకి మనం వేరు వేరుగా కనిపించినా ..లో లోపల మనమంతా ఈ తల్లి భూమి పుత్రులమే..అది చాటిచెప్పటమే సమరసత. గోదావరిఖని లో సామాజిక సమరసతా వేదిక కార్యకర్తల ప్రయత్నంతో ఒక్కటైన వివిధ కులాలు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనబడని కులాలు,వర్గాలు,ఆరాధనలు,ఆచారాలు,కట్టుబాట్లు,వేశాలు,ఆహార అలవాట్లు మనదేశంలోనే వున్నాయి.అది బలహీనత కాదు.అదే మన దేశానికి బలం.భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా! కులాలు,దేవుళ్ళు ఎందరున్నారు కాదు ప్రశ్న.అందరిమధ్య సామరస్యం నెలకొల్పి అందరం ఒకటే అని భావన కలిగించటమే నిజమైన కర్తవ్యం. ఆ పని వేల సంవత్సరాలుగా చేస్తున్న కారణంగానే ఏ దేశం దాడులు,ఆక్రమణల తరువాత కూడా ఇంకా నిలిచివుంది. ఆ సామరస్యత దెబ్బతిన్నందు వల్లనే మనం బానిసలమయ్యాం. మళ్ళీ ఆ సమరసత ను నిర్మిస్తే చాలు మనకు ఎదురే లేదు..ఆ దిశలో పని చేస్తున్నది సామాజిక సమరసత వేదిక.. గోదావరిఖనిలో అక్టోబర్ 8న వాల్మీకీ జయంతి రోజున హిందూ సమాజంలోని అన్ని వర్గాలను కలిపే అలయ్ బలయ్ కార్యక్రమంలో 300 మందికి పైగా ప్రజలు కలిసి తమ మనుగడ కొనసాగాలంటే అందరికి భారతీయులం,హిందువులం అనే భావన వుండాలని స్పష్టంగా ఆలోచించటం మొదలైంది. కాటిపాపలవారు,గంగిరెద్దులవారు,పంబాలవారు,డుబ్బలోల్లు,బైండ్లవాళ్ళు,మాల,మాదిగ,వెలమ,బ్రాహ్మణ,రెడ్డి,గౌడ,పద్మశాలి,నాయిబ్రాహ్మణ,యాదవ,వైశ్య,మున్నూరు కాపు,వీరశైవ,నేతకాని,చాకలి,రెల్లి,దూదేకుల, మేర,లంబాడి,మిత్తుల అయ్యవారు,మోచి,ఆరె కటిక,మాల జంగం,రాజన్నలోళ్ళు,కుమ్మరి,కమ్మరి,బోయ,బొందల,కంచర,మాల దాసరి,బుడగ జంగం,గంగపుత్ర,గాండ్ల,స్వర్ణకార,బుక్కోళ్ళు,ఎరుకల,కురుమ,వడ్డెర,ముదిరాజు,పెరుక,మేదరి,విశ్వబ్రాహ్మణ ...మొదలైన అన్ని కులాల వారు తరతమ భేదాలు మరిచి మన హిందూ సంస్కృతిని రక్షించుకోవలని,అందులొనే తమ అస్తిత్వ్వం భద్రంగా వుంటుందని భావించారు. కొట్లాటలు,ఘర్షణలు,కలతలు లేని హిందూ సమాజాన్ని చూడాలని కలలు గన్న కార్యక్రమం ఇది

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers