Saturday, September 13, 2014

చెప్పులు బాగు చేసే తెలివి నాకుంది


వేదాధ్యయనం చేసే తెలివి నీకు వుంది.నీవు నా చెప్పులు బాగు చెయ్యగలవా? కులం అనేది సాంఘిక వ్యవస్థ.ఎవరి పని వారిది.అంత మాత్రాన నువ్వు నా తల మీద ఎక్కి త్రొక్క వచ్చా? కులం వుండొచ్చు గాక.వర్గాలు ఏర్పడవచ్చు గాక.అయితే ఈ అధికారమేమిటి? వేదాంతం ఏమి చెపుతుంది? నువ్వెలా మనిషివో అలాగే నేనూ మనిషినే..నీలో వుండే ఈశ్వరుడే,నాలోనూ వున్నాడు..ఇదే మనం కోరుకోవాలి...ఇతరులకంటే ఎవ్వరికీ ఎక్కువ అధికారం వుండకూడదు.ఇతరులకు స్వాతంత్ర్యం ఇవ్వాలని కోరుకోనివాడికి కూడా స్వాతంత్ర్యం అక్ఖర్లేదు.వారు .స్వేచ్చకు అర్హులు కూడా కాదు.

మానవ జాతి అందరి పట్లా సమత్వ భావాన్ని కల్పించేదే నిజమైన జ్ఞానం..నిజమైన విద్య..అని స్వామి వివేకానంద అంటరానితనం నిర్మూలనకు 110 సంవత్సరాల క్రితమే చూపిన మార్గం మనకు ఆదర్శం.

వివేకనంద స్వామికి ఇంత కఠినంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వివేకానందుని ప్రసంగాలు విదేశాల్లో సనాతన హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని కల్గింపచేశాయి.భారతదేశంలోని హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించాడు.ఇంత గొప్పపనిని కేవలం 9 సంవత్సరాలలో పూర్తిచేశాడు.ఇంతటి కార్యం సాధించిన స్వామీజికి తప్ప హిందూ సమాజాన్ని శాసించే హక్కు ఇంకా ఎవరికి ఎవరికి వుంటుంది?
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers