Saturday, September 13, 2014

కేరళ వాళ్ళు పిచ్చివాళ్ళంటూ స్వామిజీ తిట్లు


కేరళ లో నిమ్న కులస్థులకు ఆలయ ప్రవేశం లేదు.అగ్రవర్ణాల వారి ఇళ్ళముందే కాదు..వీధుల్లోకి కూడా ప్రవేశించరాదు.పెద్ద కులాల వారిని కన్నెత్తి కూడా చూడకూడదు.ఒక ఫలానా కులం లోనైతే స్త్రీలకు వివాహమే నిషేధించబడింది. ఈ దమనకాండ తెలుసుకుని...కేరళ ప్రాంతం వెళ్ళి అక్కడి ప్రజల్లో వున్న మూఢాచారాలు,దురాచారాలు చూసి స్వామి వివేకానంద వాళ్ళ మీదికి విరుచుకు పడ్డాడు..ఏమన్నాడో తెలుసా.?
హిందువులైన మీకు మతం లేదు..వంట ఇల్లే మీ దేవుడు..వంట పాత్రలే వేదం.ఈ మళయాళ ప్రజలు పిచ్చివాళ్ళు .మీ ఇళ్ళు పిచ్చోళ్ళ నిలయాలు..మీరు మంచి బుద్ధిని పొందేవరకు భారతీయులందరు మిమ్మల్ని పరిహసిస్తారు..మిమ్మల్ని నిరాకరిస్తారు..అంటూ కోపం తో శాపనార్థాలు పెడతాడు..
ఆ తరువాతి కాలం లో స్రీ నారాయణగురు వెనుకపడిన వర్గంలో పుట్టినప్పటికినీ దేవలాయాలు నిర్మించి , పూజారులుగా నిమ్న కులస్థులనె నియమిస్తాడు...ఒక వైపు అంటరానితనమనే క్షోభ అనుభవిస్తూ కూడా..ఇతర మతాలు పుచ్చుకోకుండా వున్న మతంలో కొనసాగటం చూసైనా ఇప్పటికైనా తాము సవర్ణులం అని భావించుకునేవారు..స్వామి వివేకానంద మరియు స్రి నారాయణగురు చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని శ్రమించాల్సిన అవసరముంది.
గమ్మత్తేమిటంటే కేరళలో ఎక్కడ కూడా ఈ రోజు..అంటరాని తనం లేదు..అన్ని చూట్లా అన్నివర్గాలకు ప్రవెశం వుంది...
స్వామి వివేకానంద తిట్లు..నారాయణగురు కష్టాలే.. వరాలుగా మారాయి ఈ రోజు..
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers