Saturday, September 13, 2014

నేడు హిందువులు ..హిందూ మతాన్ని అనుసరిస్తున్నారా?


దళితులను గుడికి రానివ్వకపోవటం, నీళ్ళ దగ్గరకు రానివ్వకపోవటం,శ్మశానాల్లోకి ఆ వర్గాల శవాలకు అంత్యక్రియలు జరపనివ్వకపోవటం..ప్రేమగా,ఆత్మీయంగా పలకరించకపోవటం..చివరికి పెళ్ళి విందుల సమయంలో ఇతరమతాల వారిని పిలిస్తారు కాని దళితులను తరువాత తినమని చెప్పటం..అలాగే ఇళ్ళను అద్దెకు ఇవ్వకపోవటం..ఇవన్నీ చూస్తుంటే వేదాలు..ఉపనిషత్తులు ..పురాణాలు మొదలైనవి ఆచరించటం లేదని..భక్తి బోధలు..ముక్తి ప్రవచనాలు ఏవీ ఆచరించకపోవటం జరుగుతున్నది..కేవలం వంటిల్లు..వంటపాత్రలు..వీటిల్లోనే వీళ్ళ మతం వుంది..ఇతరులు ముడితేనే అపరిశుద్ధులైపొతే ..మీ ప్రవచనాలతో,మంత్రాలతో, ఇతరులను ఎలా పరిశుద్ధులను చేస్తారో ఎవరికీ అర్థం కాదు..ఎందుకంటే వేదాల్లో ,ఉపనిషత్తుల్లో ,పురాణాల్లో, భక్తి భొధనల్లో ఎక్కడా అంటరాని తనం లేదు..మరి వీళ్ళు రోజూ ఆచరిస్తున్నదేమిటి?? మానసిక రుగ్మత తప్ప మతం లేదు..ధర్మం లేదు...

స్వామి వివేకానంద అప్పట్లో చెప్పిన మాటలు ఎంత ఘాటుగా వున్నాయో చూశారా? వికాసమే జీవనం..సంకుచితం మరణం ...ప్రేమ వికాసం..స్వార్థం మరణం..సనాతన హిందూ ధర్మానికి అంటరానితనం ఒక మూఢ విశ్వాసం ..ఇప్పటికే దీనివల్ల దేశ కార్యకుశలతకు కీడు వాటిల్లింది...అంటూ స్వామీజి చెప్పిన పలుకులు నేటికీ అనుసరణీయం...
- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers