Saturday, September 13, 2014

స్వామి వివేకానంద చికాగో లో ఉపన్యసించిందుకు గొప్ప వాడయ్యాడా?


ఆయన గంభీర ఉపన్యాసం విన్న కారణంగా అందరు ఆకర్షించబడ్డారా?
కానే కాదు..ఆయన మాటల వెనుక అతని కరుణాంతరంగం వుంది..పేదవారు..దుఖితులు..నిమ్న కులస్థులు అనే మాటలు విన్నప్పుడు అతని మనసు వేదన పడేది..ఆయన మాటలు గంభీరమయ్యేవి..స్వామిజి చిన్నప్పటి నుండి అంతే. .

1.స్వామి వివేకానంద పూర్వ నామం నరేంద్రనాథ్ దత్తా. చిన్న వయస్సులో వాళ్ళింట్లో కులాలు,మతాల వారిగా పొగ పీల్చే హుక్కాలుండటం చూసి, "ఒక కులం వారు ఇంకొకరి హుక్కా ఎందుకు పీల్చకూడదు" అని తండ్రిని అడిగినప్పుడు 'కులం" పోతుందని తండ్రి జవాబిచ్చినపుడు, అదెలా సాధ్యమని అంటూ తాను ఆ హుక్కాను నోట్లో పెట్టుకుని,తన కులం పోలేదే' అంటూ నాన్నను ప్రశ్నించటం.ఈ సంఘటన .అనుకోకుండా జరగలేదు..కులాల అంతరాలు లేని సమాజ నిర్మాణానికి నడుము కట్టడానికి ముందు ఆ బాలుడి అంతరంగం మధనానికి గురయ్యింది.

2.చికాగో వెళ్ళటానికి ముందు, 2 సంవత్సరాలు భారత పర్యటన చేస్తున్నప్పుడు,ఒక చిలుము గొట్టం తో పొగ పీలుస్తున్న ఒక వ్యక్తి వద్దకు వచ్చి, ఆ గొట్టం తనకిమ్మంటాడు..అప్పుడతను..నేను నిమ్న కులస్థుడను ' అంటూ సమాధానమివ్వగానే..వివేకనంద వెళ్ళిపోతాడు.ఒక అర కిలోమీటర్ నడిచిన తరువాత..' నిమ్న కులం అనగానె తాను వెళ్ళిపోయానె అని బాధ పడి,సన్యాసికి కులమేమిటి అనుకుని,మళ్ళి నడిచివచ్చి,ఆ గొట్టం తీసుకుని పొగ పీలుస్తాడు..

3.ఒకసారి ఒకచోట స్వామిజి,3 రొజులుండి,ఉపన్యాసాలతో అలిసిపొయాడు,ఆకలేస్తుంటె అడిగేవారే లేరు.. అప్పుడు ఒక నిమ్న కులస్థుడు పలకరించగానే..స్వామిజి 'ఏదైన తినడానికి ఇస్తావా అని అడుగుతాడు..అప్పుడతను తాను అంటరానివాడినని,తాను చేసిన చెపాతీలు ఎల తింటావనీఅడుగుతాడు.అప్పుడు స్వామిజీ 'నువ్వు చేసిన చెపాతీలే కావాలంటాడు..అలా తిని, అదే అమృతంగా భావిస్తాడు. ఆ వ్యక్తి విశాల హృదయం గలవాడని,అతన్ని పట్టుకుని,అంటరానివాడని అనటం మహా ఘోరం అని వ్యాఖ్యానిస్తాడు స్వామి వివేకానంద..ఆ విషయాన్ని ఖేత్రీ మహరాజుకు చెప్పి ఆ వ్యక్తిని పిలిపించి అతని ఆర్థిక సమస్యలు తీర్పిస్తాడు..

- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers