Saturday, September 13, 2014

స్వామి వివేకానంద ఏ కులం వాడు? గో రక్షణకు వ్యతిరేకమా?


అమెరికాలో ఒక రైలు బండి దిగినప్పుడు,స్వామి వివేకానంద వద్దకు ఒక నీగ్రో (అమెరికాలో నీగ్రోలను అంటరానివారుగా చూసేవారు) వచ్చి, కరచాలనం చేస్తూ " నీకు అభినందనలు..మా జాతికి చెందినవాడు ఇంత ప్రఖ్యాతి పొందటం మా జాతికే గర్వకారణం" అంటూ పొగుడుతాడు.అప్పుడు స్వామిజీ కృతజ్ఞతలు చెబుతాడు..అప్పటినుండి దక్షిణ అమెరికా ప్రజలు స్వామిజీ 'నీగ్రో ' కాబట్టి,దూర దూరంగా వుంచుతారు.హోటల్స్ లో ప్రవెశం లబించదు..సెలూన్ సెంటర్ లో కూడా జుట్టు కత్తిరించరు..అప్పుడు ఒక ఒక అమెరికా శిష్యుడు 'స్వామిజీ ..మీరు నీగ్రో కాదు..భారతీయులని చెప్ప వచ్చు కదా?అని అన్నప్పుడు..స్వామిజి ఏమంటారొ తెలుసా..?

'ఏమిటీ? ఒకరిని కించపరిచి నేను ఉన్నతుణ్ణి కావడమా? అందుకోసం నేను జన్మించలేదు.' అని అంటాడు.

పేదవాళ్ళను కాకుండా కేవలం గోవులను మాత్రం రక్షించడానికి చందాలు వసూలు చేసేవారు వివేకనంద వద్దకు వచ్చినప్పుడు...పేదవారి స్థితిగతుల గురించి స్వామిజీ వాళ్ళ ముందు ప్రస్తావించినప్పుడు..వాళ్ళు ఏమంటారంటే " ఆ పేదవాళ్ళ కర్మ ఫలితం కారణంగానే అది జరిగిందని,,మేమేమి చేయలేమని చెప్పినప్పుడు..స్వామిజి అంటారు కదా..'మరి గోవుల గత జన్మ కర్మ ఫలితం వల్లనే వాటికి ఈ దుస్థితి కలిగిందని ఎందుకు భావించకూడదని ప్రశ్నిస్తాడు..వాళ్ళకు చందా ఇవ్వకుండానే తిప్పి పంపిస్తాడు..

అన్ని జీవుల పట్ల ప్రేమ,కారుణ్య భావం కలిగుండాలని స్వామిజీ కోరిక..

- అప్పాల ప్రసాద్.

0 comments:

Post a Comment

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers