Monday, September 15, 2014

సమరసత పాట



సమరసతా సాధనలో...పాట..

సమరసతా సాధనలో కలిసి మెలిసి నడుద్దాం..
కలత లేని సమాజాన్ని కనులు ముందు నిలుపుదాం..!!

వెర్రితలలు వేస్తున్నది కుల విద్వేషం..
మర్రిచెట్టు ఊడలా పాతుకుపోయిన దోషం..
తరతరాల వివక్షతను సమూలంగ తొలగించి..
సామరస్య భావనలను పెంచి పోషించుదాం..!!

అంటరానితనము మన ప్రగతికి అవరోధం..
వేదంలో కనిపించని ఘోర దురాచారం..
ఆవేదన,ఆక్రోశం,ఆవేశం రగిలినా..
అనురాగం,ఆత్మీయత పనుచుకు జీవించుదాం..!!

కులభేదం మరిచి మనం కలిసి భుజిద్దాం..
ఇంటింటికి వెళ్ళి మనం స్నేహం అందింద్దాం..
అంతరాలు అంతమయ్యెవరకు శ్రమిద్దాం..
ఒకరికొకరు తోడుగుండి శాంతిని సంకల్పిద్దాం..!!

వ్యక్తిని వ్యక్తిగ చూసే గౌరవ సద్భావం..
ఒకే కుటుంబంలొ మనం అందరం సమానం..
అందరిలో వున్నది పరమాత్ముని రూపం..
భరతమాత సేవలోన సర్వం అర్పిద్దాం..     !!
రచన: అప్పాల ప్రసాద్.

ఈ పాటను అందరికి పంపించండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.

1 comment:

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers