Friday, August 29, 2014

సినిమా దర్శకులు నడిపించే హీరోలకంటే..హిందూ గణపతికి ప్రపంచమంతా కోట్లాది అభిమానులు



గణపతియే హేరో..గణపతే దర్శకుడు.గణపతే గురువు.దైవం..

గణపతి ఆకారం చూసి చేసే వక్రభాష్యాలు అజ్ణానానికి ప్రతీక...

ఎలుక అంటే తెలివితక్కువతనం.అంటే అజ్ఞానం..అంటే చీకటి.ఆ చీకటిపై స్వారీ చేసే జ్ఞానవంతుడు గణపతి.అందువల్ల ఆ ఎలుకకు ఒకరకంగా గణపతి బరువే కదా..గణపతి బుద్ధికి ప్రాధాన్యమిచ్చాడు.గణపతి ఎక్కువ తింటాడు.కాని ఆవిరితో చేసిన పదార్థాలు,అలాగే నూనె లేని పదార్థాలు అంటే ఆయనకు చాలా ఇష్టం.అందుకే భక్తులు బియ్యం పిండితో చేసిన కుడుములు,బెల్లం,నువ్వులతో కూడినవి నైవేద్యం పెడతారు.అందుకే గణపతి నిత్య ఆరోగ్యవంతుడు.నూనె పదార్థాలు తింటే కడుపులో జీర్ణశక్తి తగ్గుతుంది.తనకు ఎక్కువైన పదార్థాలు ఎలుకకు పెడతాడు.గణపతికి పొట్ట వున్నా జీర్ణశక్తి తక్కువేమి కాదు.పైగా జీర్ణం కాగల గరిక అంటే కూదా గణపతికి ఇస్టం.తన శరీరం కంటే జ్ణానాన్ని అభిమానిస్తాడు.అందుకే గణపతి శరీరం లోని సూక్ష్మ విషయాలు గ్రహించినప్పుడే మన బుద్ధి వికసిస్తుంది.గణపతి ఆకారం చూసి చేసే వక్రభాష్యాలు అజ్ణానానికి ప్రతీక.ఆ అజ్ణానమే ఎలుక..ఇలాంటి ఎలుకలు రాత్రి పూట తిరుగుతుంటాయి.వీటికి వెలుగంటే భయం.ఎందుకు? ప్రకాశానికి ప్రతిబింబం మన గణపతి.

శరీరం పట్ల దురభిమానం తగ్గించుకొమ్మని చెప్పెదే గణపతి పండుగ.తగిన ఆహారవిహారాలతో గణపతి అందరిలో మొదటివాడయ్యాడు.విద్యార్థులు పైపై చదువుల కంటే అందులోని సారాన్ని అంటే అర్థాన్ని గ్రహించాలి.ప్రశ్నించటం తప్పుకాదు.ప్రశ్నించి అందులోని సూక్ష్మ మైన విషయాలు గ్రహించినప్పుడే ఫలితం వుంటుంది. 

గణపతికి చావేమిటి..పుట్టుక ఏమిటి?ప్రజలకొసం పుడతాడు.పనిపూర్తి అయితే అవతారం చాలిస్తాడు. అవతార పురుషుడు.సినిమాల్లో అందమైన హీరోలను పంచుకుని కొందరు యువకులు అభిమానిస్తారు..ముఖం అందంగా లేకున్నా సరే,ఆ ముఖంలోని తత్వాన్ని,రహస్యాన్ని తెలిపి అన్ని వయస్సులవాళ్ళ పూజలందుకుంటున్నాడు మన గణపతి.
ఆయన సృష్టించింది ఈ ప్రపంచం.ఆయన తొండంతో తింటాడా..నోటితో తింటాడా కాదు ప్రశ్న..ఆయన తినేదేదైనా ఆరోగ్యమైంది.గణపతికి చూపించి మనం తిని ఆరోగ్యవంతులం కావాలి..ఇది అందరికి తెలిసే చిన్న సూక్ష్మమైన విషయం..ఇది కూడా అర్థం కాని పెద్దమనుషులను ఏమీ అనకూడదు.అందుకే కదా గణపతి వచ్చింది..వీళ్ళకు బుద్ధిని ప్రసాదించమని కోరాలి.మరి ఇలాంటి బుద్ధిహీనులను ఎందుకు భగవంతుడు పుట్టించాడు..ఇలాంటి వారు ఎప్పటికీ వుంటారని మనకు తెలియచెప్పటానికే ఈ పండుగలు. 

హిరణ్యకశిపుడికి కూడా చదువులలోని "సారాన్ని" "రహస్యాన్ని" అతని కుమారుడు ప్రహ్లాదుడు అర్థం చేయించవలసి వచ్చింది. అందుకే శరీరం పెరిగితే సరిపోదు.బుద్ధి వికసించాలి అని తెలియచేసేదే గణపతి పండుగ.

- అప్పాల ప్రసాద్.

మీరేమంటారు!!!

2 comments:

  1. రాంగోపాల్ వర్మ గారు మీరు ఈ వ్యాసం తప్పకుండా చదవాలి. కళ్ళు తెరిచి పబ్లిసిటీ కోసం అనవసరంగా నోరు పరేసుకోకండి....

    ReplyDelete
  2. నిజం చెప్పావు మిత్రమా....

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers